Share News

ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరి: కలెక్టర్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:35 AM

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్ధలలో చదువుతున్న 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆల్బెండ జోల్‌ మాత్రలను తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్‌ కె.శ్రీనివాసులు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరి: కలెక్టర్‌
పోస్టరును ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, అధికారులు

నంద్యాల (కల్చరల్‌), ఫిబ్రవరి 5: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్ధలలో చదువుతున్న 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆల్బెండ జోల్‌ మాత్రలను తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్‌ కె.శ్రీనివాసులు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం వైఎస్సార్‌ సెంటినరీ హాలులో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో నులిపురుగుల నియంత్రణ పోస్టరును ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా విద్యార్థులు రక్తహీనత నివారణకు ఉపాధ్యాయులు, ఐసీడీఎస్‌ సిబ్బంది, సంక్షేమ వసతి గృహాల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకో ాలని ఆదేశించారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో డీఎంహెచ్‌వో, జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.

పబ్లిక్‌ వర్క్స్‌, మున్సిపాలిటీ లోకల్‌ బాడీస్‌, ప్లాన్‌ అప్రూవల్‌ అథారిటీస్‌, ఎంపీడీవో, ప్రభుత్వ రంగ సంస్థలు విధిగా ఒక శాతం లేబర్‌ సెస్‌ను డిడక్టు చేసి ఏపీ భవన నిర్మాణరంగ కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాలని కలెక్టర్‌ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వైఉస్సార్‌ సెంటినరీ హాలులో కలెక్టర్‌ అధ్యక్షతన కార్మికుల సంక్షేమ జిల్లా స్ధాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంయుక్త కమిషనర్‌ బాలునాయక్‌, కార్మిక ఉప కమిషనర్‌ వెంకటేశ్వర్లు, సహాయ కార్మిక కమిషనర్‌ బషిరున్నీసా బేగం, తదితర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతినెలా ఒక శాతం సెస్‌ కు సంభందించిన వివరాలను కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు పంపాలని ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఒక శాతం సెస్‌ మొత్తాన్ని జమ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక సహాయ కమిషనర్‌, కమిటి సభ్యులను కలెక్టర్‌ సూచించారు.

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటనరీ హాలులో సోమవారం పశుసంవర్థక శాఖ డైరీని నంద్యాల కలెక్టర్‌ శ్రీనివాసులు, సంబందిత అధికారులు పాల్గొని ఆవిష్కరించారు.

Updated Date - Feb 06 , 2024 | 12:35 AM