ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:39 PM
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విపత్తు నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు సంబంధిత శాఖలు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ రాజకుమారి
నంద్యాల కల్చరల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విపత్తు నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు సంబంధిత శాఖలు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్పరెన్స్ హాలులో డిజాస్టర్ మేనేజ్ మెంట్ ముందస్తు జాగ్రత్త చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మా ట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలోని వాగులు ఉప్పొంగడం వల్ల గ్రామాల మధ్య రహదారుల రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు. నంద్యాల పట్టణానికి ఆనుకొని ఉన్న కుందూ నదిలో కుందేరు, బుగ్గవంక, పాలేరు, గాలేరు, మద్దిలేరు, సప్పిటి వాగులు కలవడం, వాగుల చుట్టూ ఉన్న స్థలాలు ఆక్రమ ణలకు గురికావడం వల్ల భారీ వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆక్రమణలు అరికట్టడంతో పాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని అన్నారు. ఆత్మకూరు డివిజన్లలో ఇటీవల కురిసిన వర్షాలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పొలాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అవసరమై చోట్ల బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని కలెక్టర్ ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవ డంతో బోర్ల ప్లషింగ్, డీపనింగ్ బోర్‌వెల్స్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌వో రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.