రాష్ట్రపతిని కలిసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి
ABN , Publish Date - Jun 08 , 2024 | 12:11 AM
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపదిముర్మును కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
-ఆదోని
నారా లోకేశ్‌ను కలిసిన టీజీ భరత్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కలిశారు. విజయవాడలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రాయలసీమలో కూటమి భారీ విజయం సాధించడంపై లోకేశ్‌తో చర్చించినట్లు టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవడంపై నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
- కర్నూలు అర్బన్