Share News

‘అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పిస్తే చర్యలు’

ABN , Publish Date - May 26 , 2024 | 11:46 PM

ఇతర ప్రాంతాలకు చెందినవారు, అపరిచిత వ్యక్తులు, అసాంఘికశక్తులు, అనుమానితులకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ ఎన్‌.రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.

‘అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పిస్తే చర్యలు’
మాట్లాడుతున్న డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డి

నంద్యాల క్రైం, మే 26: ఇతర ప్రాంతాలకు చెందినవారు, అపరిచిత వ్యక్తులు, అసాంఘికశక్తులు, అనుమానితులకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ ఎన్‌.రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని లాడ్జీలు, డార్మెటరీలు, ఫంక్షన్‌హాళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమానులతో టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసాంఘిశక్తులు పట్టణంలో వసతి ఏర్పాటు చేసుకో కుండా లాడ్జీలు, డార్మిటరీలు, ఫంక్షన్‌హాళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమా నులు పోలీస్‌శాఖతో సహకరించాలన్నారు. జూన్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌ నేప థ్యంలో నంద్యాల పట్టణంలో గొడవలు, అల్లర్లు జరగకుండా ఉండేందుకు తీసుకునే చర్యల్లో భాగంగానే ఇంటర్వ్యూలకు, అత్యవసరంగా ఆస్పత్రులకు వచ్చేవారికి మాత్రమే ఆశ్రయం కల్పించాలని సూచించారు. అలా కాకుండా అసాంఘిక శక్తులు, అనుమానితులు, బెట్టింగ్‌లకు పాల్పడేవారు, జల్సాలు చేసేవారికి ఆశ్రయం కల్పించవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో సీఐలు దస్తగిరిబాబు, నరసింహులు, రాజారెడ్డి, ఎస్‌ఐ నవీన్‌, లాడ్జీలు, డార్మెటరీలు, ఫంక్షన్‌హాళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 11:46 PM