Share News

వంద రోజుల ప్రణాళికా లక్ష్యాలను సాధించండి: కలెక్టర్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:04 AM

వంద రోజుల ప్రణాళికా లక్ష్యాలను సాధించండి: కలెక్టర్‌

వంద రోజుల ప్రణాళికా లక్ష్యాలను సాధించండి: కలెక్టర్‌

నంద్యాల (కల్చరల్‌), ఆగస్టు 20: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నిర్దేశించిన లక్ష్యాలను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి క్షేత్రస్ధాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్లో వంద రోజుల ప్రణాళిక అమలు తీరుపై ఎంపీడీఓలు, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌ తదితర ఇంజనీరింగ్‌ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో 20 లక్షల మంది జనాభా ఉంటే అన్ని కేటగిరీల సిబ్బంది కలిపి 20 వేల మంది పని చేస్తున్నారని అన్నారు. జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకొ ని జిల్లాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మండలంలో జరిగే ప్రతి యాక్టివిటీ ఎంపీడీవోల ద్వారానే జరగాలని ప్రజల అవసరాలను గుర్తించి వంద రోజుల ప్రణాళికలో చేపట్టిన అంశాలపై పూర్తిస్ధాయిలో దృష్టి సారించాలన్నారు. ప్రతి రోజూ కనీసం రెండు ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తూ పురోగతి సాధించాలని హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మంజులవాణి, డ్వామా పీడీరామచంద్రారెడ్డి, హౌసింగ్‌ పీడీ వెంకటసుబ్బయ్య, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:04 AM