నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:45 AM
నంద్యాల, గుంటూరు జిల్లాల్లో దొంగతనాలు, గ్యాంగ్‌రే్‌పలకు పాల్పడుతున్న చెంచుదాసరి సుంకన్న అలియాస్ తోల్లోడు అనే వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలు వెల్లడించారు.

నంద్యాల క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నంద్యాల, గుంటూరు జిల్లాల్లో దొంగతనాలు, గ్యాంగ్‌రే్‌పలకు పాల్పడుతున్న చెంచుదాసరి సుంకన్న అలియాస్ తోల్లోడు అనే వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలు వెల్లడించారు. నిందితుడు చెంచు దాసరి సుంకన్న స్వగ్రామం గడివేముల మండలం కరిమద్దెల అని తెలిపారు. నిందితుడు 2016 నుంచి ఇప్పటివరకు నంద్యాల జిల్లా, గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, గ్యాంగ్‌రే్‌పలకు పాల్పడ్డాడన్నారు. ఇతడి కోసం రెండు జిల్లాల పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టకేలకు నిందితుడిని సోమవారం ఉదయం 11గంటల సమయంలో నంద్యాల ఆటోనగర్ వద్ద అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 3 తులాల బంగారు నల్లపూసలదండ, 8గ్రాములు బరువు కలిగిన ఒక జత బంగారు కమ్మలు వీటి విలువ రూ.2.50 లక్షలు సీజ్ చేశామన్నారు. నిందితుడు తన అనుచరులతో కలిసి నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడి వచ్చిన సొమ్మును పంచుకునేవారని తెలిపారు. వీరు గతంలో నంద్యాల జిల్లాలోని నంద్యాల తాలుకా, పాణ్యం, మహానంది, పాములపాడు, బండిఆత్మకూరు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో సుమారు 11దొంగతనాలు, రెండు దోపిడీల్లో పాల్గొన్నారన్నారు. నిందితుడిని అరె్‌స్ట చేసినవారిలో సీసీఎస్ సిబ్బంది హెడ్‌కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, ఇబ్రహీమ్, యేసుదాసు, పోలీస్ కానిస్టేబుళ్లు గంగారం, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, నాగరాజు, మాలిక్‌బాషా, ఇస్మాయిల్ ఉన్నారు. వారిని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ ఎన్.యుగంధర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు.