Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:13 AM

పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధీరజ్‌రెడ్డి(22) దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ప్యాపిలి, జూలై 7: పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధీరజ్‌రెడ్డి(22) దుర్మరణం చెందాడు. మండలంలోని ఎర్రగుంట్లపల్లికి చెందిన వైసీపీ నాయకుడు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుమారుడు ధీరజ్‌రెడ్డి, అతని స్నేహితుడు రమేష్‌ తెల్లవారుజామున వెంగళాంపల్లి గ్రామానికి బైకుపై వెళ్లి తిరిగి ఎర్రగుంట్లపల్లికి బయలుదేరారు. బైపాస్‌ రోడ్డులో పెద్దమ్మ డాబా సమీపంలో ముందు వెళ్లుతున్న కారు సడన్‌ బ్రేక్‌ వేయడంతో వీరి బైక్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధీరజ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మెట్టు వెంకటేశ్వరరెడ్డి, గజేంద్రరెడ్డి, చిన్నసుంకయ్య, రాజామురళి, గడ్డం భువనేశ్వరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Updated Date - Jul 08 , 2024 | 12:13 AM