Share News

పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

ABN , Publish Date - May 15 , 2024 | 12:09 AM

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామ శివార్లలో పిడుగు పడి తెలుగు పెద్ద ఆంజనేయులు(35) అనే గొర్రెల కాపరి మృతి చెందాడు.

పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

ఆత్మకూరు రూరల్‌, మే 14: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామ శివార్లలో పిడుగు పడి తెలుగు పెద్ద ఆంజనేయులు(35) అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. ఆత్మకూరు మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని అమలాపురం గ్రామానికి చెందిన పెద్ద ఆంజనేయులు వెంకటాపురం గ్రామ శివార్లలోని పొలాల్లో గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. ఆ ప్రాంతంలో పిడుగు పడడంతో పెద్ద ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం పనులు చేసుకుంటున్న గ్రామస్థులు గమనించి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.. మృతునికి భార్యతో పాటు ఓ కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

Updated Date - May 15 , 2024 | 12:09 AM