మహానందీశ్వరుడి సన్నిధిలో కొత్త కలెక్టర్
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:14 AM
మహానంది క్షేత్రంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి దంపతులు ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహానంది, జూలై 7: మహానంది క్షేత్రంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి దంపతులు ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌గా పదవి భాధ్యతలు స్వీకరించిన తర్వాత మహానందీశ్వరుడి దర్శనం కోసం రాగా వీరికి ఆలయం ముఖధ్వారం వద్ద వేదపండితులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో సాయంత్రం వేళల్లో నిర్వహించే మహామంగళ హారతుల సేవలో పాల్గొన్నారు. ప్రధాన గర్భాలయాల్లో స్వామి, అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేకార్చనలు జరిపారు. కల్యాణ మంటపంలో కలెక్టర్ దంపతులను వేదపండితులు రవిశంకర్ అవఽధాని, హనుమంత్‌శర్మలు అశీర్వదిం చారు. ఆలయ ఏఈఓ వెంకటేశ్వర్లు శాల్వతో సన్మానించి, పట్టు వస్త్రాలు అందజే శారు. మండల డిప్యూటీ తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.