Share News

కనీస పెన్షన్‌ రూ.9వేలు ఇవ్వాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:48 AM

పెన్షనర్లకు కనీస పెన్షన్‌ రూ.9వేలు ఇవ్వాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్ట్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరప్ప డిమాండ్‌ చేశారు.

కనీస పెన్షన్‌ రూ.9వేలు ఇవ్వాలి

కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 6: పెన్షనర్లకు కనీస పెన్షన్‌ రూ.9వేలు ఇవ్వాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్ట్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరప్ప డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అసోసి యేషన్‌ అధ్వర్యంలో మంగళవారం అశోక్‌నగర్‌ సెంటర్‌ నుంచి ఈపీఎఫ్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సుధాకరప్ప మాట్లాడుతూ వివిధ పారిశ్రామిక వాడలలో పని చేస్తూ పెన్షన్‌ పొందుతున్న వారు రాష్ట్రంలో లక్షా యాబైవేల మంది ఉన్నారన్నారు. ప్రైవేటు సంస్థలలో 20-30 సంవత్సరాలుగా పని చేస్తూ రిటైర్డ్‌ అయిన తరువాత రూ.1000 పెన్షన్‌ వస్తే ఎలా బతకాలని అన్నారు. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కనీస పెన్షన్‌ రూ.3 వేలే ఇస్తామని వాగ్దానం చేసి పదేళ్లు గడుస్తుందన్నారు. కనీస పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలని ఆందో ళనలు చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చలనం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాక్రిష్ణ, నాయకులు ప్రభాకర్‌, మద్ది లేటి, అసోసియేషన్‌ నాయకులు శంకర్‌రావు, మురళీమోహన్‌హరావు, వెంక టేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:48 AM