Share News

వంకలోకి దూసుకెళ్లిన లారీ

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:53 AM

మండలంలోని ఇటిక్యాల సమీపంలో ఏస్సీ పాలిషింగ్‌ యూనిట్‌కు ఎదురుగా ఐసర్‌ లారీ అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది.

వంకలోకి దూసుకెళ్లిన లారీ

కొలిమిగుండ్ల రూరల్‌, ఏప్రిల్‌ 17: మండలంలోని ఇటిక్యాల సమీపంలో ఏస్సీ పాలిషింగ్‌ యూనిట్‌కు ఎదురుగా ఐసర్‌ లారీ అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. తాడిప్రతి నుంచి కోవెలకుంట్లకు వెళ్తున్న లారీ ఇటిక్యాల వద్దకు రాగానే ఒక్కసారిగా రాంగ్‌ రూట్లోకి వచ్చి, వంక వైపు దూసుకెళ్లింది. ఈఘటనలో డ్రైవర్‌ నాగయ్యకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుప్రతికి తరలించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:53 AM