వాడీవేడిగా సమావేశం
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:17 AM
గూడూరు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం వాడీవేడిగా సాగింది.

అక్రమ లేఅవుట్‌పై చర్యలు తీసుకోవాలి
పనుల నిర్వహణపై సమాచారం ఇవ్వకపోతే ఎలా?
గూడూరు డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): గూడూరు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం వాడీవేడిగా సాగింది. శనివారం గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన జె వెంకటేశ్వర్లు అధ్యక్షతన కమిషనర్ నాగరాజు బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ రేమట సురేష్, కో అప్షన మెంబరు రామాంజనేయులు మాట్లాడుతూ నగర పంచాయతీ ఆదాయం ఎంత.. ప్రభుత్వం నుంచి మంజూరు అవుతున్న నిధులు ఎంత .. ఏయే పను లకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారు వాటి వివరాలు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి కోసం వచ్చిన నిధులను ఖర్చు చేయలేని దుస్థితిలో పాలక వర్గం, అధికారులు ఉన్నారని ధ్వజమెత్తారు. అలాగే అక్రమ లేఅవుట్లు ఇష్టారాజ్యం వేస్తుంటే ఏం చేస్తు న్నారని ప్రశ్నించారు. తక్షణం అధికారులు అక్రమ లేఅవుట్లు వేసిన వారిని నోటీసులు ఇవ్వాలన్నారు. ఆదాయ వనరులు, ప్రభుత్వ నిధులు, ఖర్చుల వివరాలు వచ్చే సమా వేశం నాటికి అందిస్తామని, అలాగే అక్రమ లేఅవు ట్లపై చర్యలు తీసు కుంటామని కమిషనర్ నాగరాజు చెప్పారు. అనంతరం కౌన్సిలర్ దస్తగిరి మాట్లాడుతూ వార్డుల్లో చేపడుతున్న పనులపై కనీసం సమాచారం ఇవ్వారా .. కౌన్సిలర్లకు ఇచ్చే గౌవరం ఇదేనా అంటూ ప్రశ్నిం చారు. ఇక ముందు కౌన్సిలర్లకు సమాచారం అందిస్తామని కమిషనర్ చెప్పారు. నగర పంచాయతీ నూతన భవనాన్ని తర్వగా పూర్తి చేయాలని కౌన్సిలర్లు కోరారు. ఈసమావేశంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్లు పీఎన అస్లాం, లక్షన్న, కౌన్సిలర్లు, కోఆప్షన సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.