మహావిరాళం
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:01 AM
మహానందీశ్వరుడికి రూ.2 కోట్ల విలువ చేసే భూమిని సమర్పించారు.

మహానంది, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మహానందీశ్వరుడికి రూ.2 కోట్ల విలువ చేసే భూమిని సమర్పించారు. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ అధ్యాపకుడు దొండపాటి రాజు, శకుంతల దంపతులు గ్రామంలో 5 సెంట్ల ఇంటి స్థలంతో పాటు 528 సర్వే నెంబర్‌లోని 2.10 ఎకరాల పొలాన్ని గురువారం మహానంది ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను ఆలయ ఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డికి దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు మహానంది ఆలయ ముఖ మండపం వద్ద ఈఓ ఆధ్వర్యంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు అభిషేకార్చనలు జరిపారు. వేదపండితులు ఆశీర్వదించి, ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఎర్రమల్ల మధు, పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్నెక్టర్ శ్రీనివాసులు, నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.