Share News

కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

ABN , Publish Date - Jul 06 , 2024 | 12:10 AM

నంద్యాల కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు బదిలీ కావడంతో శుక్రవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
కలెక్టర్‌ శ్రీనివాసులును సన్మానిస్తున్న అధికారులు

నంద్యాల (కల్చరల్‌), జూలై 5: నంద్యాల కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు బదిలీ కావడంతో శుక్రవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌కు రెవెన్యూ యంత్రాంగం, జిల్లా అధికారులు సంయుక్తంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ డివిజన్ల అధికారులు, రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లాకు రెండవ కలెక్టర్‌గా వచ్చి అత్యుత్తమ సేవలు అందించారని కొనియాడారు. కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఐదు నెలల కాలంలో అధికారులు, సిబ్బంది సహకారంతో అత్యంత బాధ్యాతయుతమైన కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామన్నారు. అనంతరం జిల్లా అధికారులు కలెక ్టర్‌ను ఘనంగా సత్కరించారు.

Updated Date - Jul 06 , 2024 | 12:10 AM