Share News

పోలీసు స్పందనకు 66 ఫిర్యాదులు

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:34 AM

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ జి.కృష్ణకాంత్‌ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి 66 ఫిర్యాదులు వచ్చాయి

పోలీసు స్పందనకు 66 ఫిర్యాదులు

కర్నూలు, జనవరి 29: ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ జి.కృష్ణకాంత్‌ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి 66 ఫిర్యాదులు వచ్చాయి.

రాజమండ్రి ఇరిగేషన్‌ డిపార్టుమెంటులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని, కన్సల్టెన్సీ పేరుతో కొంత మంది వ్యక్తులు మోసం చేశారని కర్నూలుకు చెందిన విష్ణు ఫిర్యాదు చేశారు.

ఆస్తి కోసం తన కుమారుడు చంపుతానని బెదిరిస్తున్నాడని హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప ఫిర్యాదు చేశారు.

తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి సర్వేయర్‌ను కొలతలు చేయనీయకుండా శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ అడ్డుపడుతున్నారని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి ఫిర్యాదు చేశారు.

పొలం కౌలుకు తీసుకున్న ప్రభాకర్‌, రంగన్నలు నకిలీ అగ్రిమెంటు సృష్టించి ఆరు ఎకరాల జొన్న పంటను దున్నేశాడని ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన ఉసేప్ప అర్జీ ఇచ్చారు.

టేడ్‌ కంపెనీ పేరుతో సైబర్‌ నేరస్థులు తన వాట్సా్‌పకు ఒక లింకును పంపి, ఫోన్‌లో ఉన్న డేటా సేకరించి తన ఖాతా నుంచి రూ.1.60 లక్షలు లాగేశారని సైబర్‌ ల్యాబ్‌ పోలీసులచే రికవరీ చేసి ఇప్పించగలరని ఎమ్మిగనూరు చెందిన రిజ్వాన్‌బాషా కోరారు.

కడప జిల్లాకు చెందిన మంజునాథ రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని నకిలీ ఉద్యోగాలు ఇప్పించి మోసం చేశాడని నాగులాపురం గ్రామానికి చెందిన ఉపేంద్ర, కర్నూలుకు చెందిన విష్ణు చరణ్‌లు ఎస్పీ ఎదుట వాపోయారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు సీఐలు ఉన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:34 AM