Share News

జిల్లాలో 29 కుష్ఠు వ్యాధి కేసులు: డీపీఎం

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:36 AM

జిల్లాలో 29 కుష్ఠువ్యాధి కేసులు నమోదైనట్లు డీపీఎం ప్రసాద్‌ తెలిపారు.

జిల్లాలో 29 కుష్ఠు వ్యాధి కేసులు: డీపీఎం

చాగలమర్రి, ఫిబ్రవరి 5: జిల్లాలో 29 కుష్ఠువ్యాధి కేసులు నమోదైనట్లు డీపీఎం ప్రసాద్‌ తెలిపారు. సోమవారం చాగలమర్రి ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. కుష్ఠువ్యాధికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన పక్షోత్సవాల్లో భాగంగా బాలికలకు కుష్ఠువ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. స్పర్శవ్యాధి లక్షణాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈనెల 13వ తేదీ వరకు కుష్ఠువ్యాధి నిర్మూలన అవగాహన సదస్సులు జరుగుతాయని అన్నారు. లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించు కోవాలని సూచించారు. హెచ్‌ఎం విజయలక్ష్మి, సూపర్‌వైజర్‌ రామలింగారెడ్డి, మనోహర్‌, ఆశా వర్కర్‌ శివలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:36 AM