Share News

కౌంటింగ్‌ విధులకు 204 మంది

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:04 AM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌ కోసం 204 మంది నగర పాలక సంస్థ, రెవెన్యూ, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి రిటర్నింగ్‌ అధికారి ఏ.భార్గవతేజ విధులకు నియమించారు.

కౌంటింగ్‌ విధులకు 204 మంది

కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 1: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌ కోసం 204 మంది నగర పాలక సంస్థ, రెవెన్యూ, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి రిటర్నింగ్‌ అధికారి ఏ.భార్గవతేజ విధులకు నియమించారు. కౌంటింగ్‌కు హాజరయ్యే అధికా రులు, ఉద్యోగుల హాజరుపట్టిక, మొబైల్‌ డిపాజిట్‌ కేంద్రం నిర్వహణ, ఏజెంట్ల గుర్తింపు కార్డుల తనిఖీ, స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ హల్‌ వరకు 137 కర్నూలు అసెంబ్లీ, 18 కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఈవీఎంలను తీసుకెళ్లడం, కౌంటింగ్‌ టేబుల్స్‌కు కావాల్సిన స్టేషనరి, మీడియా పాయింట్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, జనరల్‌ అబ్జర్వర్‌కు నివేదికలు తయారు చేయడం, మీడియా పాయింట్‌, కౌంటింగ్‌ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరచడం కోసం సుమారు వీరిని నియమించారు. కౌంటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ముందస్తు చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:04 AM