Share News

మహానందిలో 16 రోజుల వేడుకలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:14 AM

మహానంది క్షేత్రంలో 16 రోజుల పర్వదిన వేడుకలను ఆలయ వేదపండితులు, అర్చకులు, ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

మహానందిలో 16 రోజుల వేడుకలు
రథశాలలోకి రథాన్ని లాగుతున్న ఆలయ ఈవో, భక్తులు

మహానంది, మార్చి 23: మహానంది క్షేత్రంలో 16 రోజుల పర్వదిన వేడుకలను ఆలయ వేదపండితులు, అర్చకులు, ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తయి 16 రోజులు కావడంతో శనివారం ఆనవాయితీ ప్రకారం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల మంటపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణ దీక్షా విరమణ సందర్భంగా ఉద్వాసన చేశారు. అనంతరం ఆలయ ఈవో చేత రుద్రగుండం కోనేరులో మొలకలను కలిపారు. ఆ తర్వాత భక్తుల శివనామస్మరణతో రథాన్ని రథశాలలోకి లాగారు. ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, ఇంజనీరింగ్‌ అధికారి శ్రీనివాసులు యాదవ్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:14 AM