Share News

పది, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - May 24 , 2024 | 11:36 PM

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

పది, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 24: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జరిగిన పది పరీక్షకు 4231 మందికి గాను 1572 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు. పరీక్ష కేంద్రాలను 15 ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ బృందాలు తనిఖీలు చేశాయి. అలాగే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 3788 మందికిగాను 3611 మంది హాజరయ్యారు. ఇందులో 177 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండో సంవత్సరం పరీక్షకు 980 మందికిగాను 897 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 83 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు నమోదు కాలేదని ఆర్‌ఐవో ఎస్‌వీఎస్‌ గురువయ్యశెట్టి తెలిపారు.

Updated Date - May 24 , 2024 | 11:36 PM