Share News

యుగపురుషుడు ఎన్టీఆర్‌

ABN , Publish Date - May 29 , 2024 | 12:57 AM

సంక్షేమ పథకాల రూపకల్పన, అమలకు స్ఫూర్తిగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని పెనమలూరు టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా పోరంకి, పెనమలూరు టీడీపీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు.

 యుగపురుషుడు ఎన్టీఆర్‌
కంకిపాడులో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

పెనమలూరు, మే 28 : సంక్షేమ పథకాల రూపకల్పన, అమలకు స్ఫూర్తిగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని పెనమలూరు టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా పోరంకి, పెనమలూరు టీడీపీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన యుగపురు షుడన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్‌ప్రసాద్‌, యార్లగడ్డ సుచిత్ర, స్వర్ణలత, షేక్‌ బుజ్జి, తుమ్మల రాంకుమార్‌, దోనేపూడి రవికిరణ్‌, బొమ్మిడి అన్నపూర్ణ, చిగురుపాటి శ్రీనివాస్‌, మట్టా జాన్‌, కిలారు ప్రసాద్‌, ఇమాం, శొంఠి శివరాంప్రసాద్‌, వీరంకి కుటుంబరావు, వీరంకి నంది, పాదాల ప్రభాకరరావు, ముసునూరి శ్రీనివాస్‌, ముసునూరి శ్రీథర్‌, గుజ్జర్లపూడి బాబురావు, ముసునూరి నిర్మల్‌, మన్నె వాసు, ఆచంట చంటి, కొమ్మినేని వెంకటేష్‌, పండల రజిని, మల్లంపాటి విజయలక్ష్మి, మేడసాని రత్నకుమారి, నాగలక్ష్మి పాల్గొన్నారు.

ఫ పెనమలూరు మండలంలోని తాడిగడప, యనమలకుదురు, కానూరు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడిగడపలో బోడె సురేష్‌ జయంతి వేడుకల కేకును కోసి అభిమానులకు పంచి పెట్టారు. కానూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు నేతృత్వంలో అభిమానుల మఽధ్య కేకును కోసి పంచిపెట్టారు. యనమలకుదురులో ఎన్టీఆర్‌ గార్డెన్సు వద్ద మజ్జిగ పంపిణీ చేపట్టారు. వివిధ కార్యక్రమాల్లో తుమ్మల రామ్‌కుమార్‌, మన్నె రాజబాబు, నర్రా చంటి, కిలారు గోపాలకృష్ణ, మొక్కపాటి శేఖర్‌, అల్లూరి విఠల్‌, లత్తుల శివకాంత్‌, సమీర్‌, రియాజ్‌, కొండ్రు కోటేశ్వరరావు, షేక్‌ బుజ్జి, రమేష్‌, షకీలా, సంపర శేఖర్‌, కొండ, షాహీనా, నందు, శివ తదితరులు పాల్గొన్నారు.

కంకిపాడు : పేదల పెన్నిది దివంగత ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవినేని రాజా, గొంది శివరామకృష్ణ, తుమ్మపల్లి హరికృష్ణ, అన్నే ధనయ్య, యలమంచిలి కిషోర్‌ బాబు, సుదిమళ్ల రవీంద్ర, పులి శ్రీనివాసరావు, బొప్పూడి శివరా మకృష్ణ, గొగినేని వెంకటరమణ, కొండా నాగేశ్వరరావు, ఏనుగ జయప్రకాష్‌, చలవాది రాజా, వణుకూరు విక్రం, శేషుకుమారి, అన్నవరపు శివపార్వతి, కల్యాణి, జనసేన పార్టీ నాయకులు ముప్పా రాజా, పచ్చిపాల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఫ తుమ్మలపల్లి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. టీడీపీ మండల పార్టీ కార్యాలయ బాధ్యుడు బొప్పూడి శివరామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మాజీ జెడ్పీటీసీ గొంది శివరామకృష్ణ, పులి శ్రీనివాసరావు, షేక్‌ బాజి, ఏనుగ జయప్రకాష్‌, డిఎన్‌ఆర్‌ పాల్గొన్నారు.

ఉయ్యూరు : వెనుకబడిన వర్గాలకు రాజకీ యాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించి వారి అభ్యు న్నతి, సాధికారిత కోసం నిబద్ధతో కృషిచేసిన మహా నాయకుడు ఎన్టీఆర్‌ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, కూటమి పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్‌ కీర్తించారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమా లవేసి ఘన నివాళులర్పించారు. పార్టీ నాయకులు యెనిగళ్ల కుటుంబరావు, గుర్నాధరావు, సత్యనారాయణ, పూర్ణ చంద్రరావు, ఖుద్దూస్‌, జయదేవ్‌, దండమూడి చౌదరి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, జనసేన , బీజేపీ పాల్గొని కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచారు.

ఫ ముదునూరులో ఎన్టీఆర్‌ జయంతిని వైభవంగా నిర్వహించారు. ప్రధాన సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పార్టీ సీని యర్‌ నాయకుడు పాలడుగు బాలాజీ ఆధ్వ ర్యంలో పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు దూసర అజయ్‌కుమార్‌, తుమ్మల రామకోటయ్య, బెనర్జీ, మాధవి, రాము, భాస్కర్‌ పాల్గొని నివాళులర్పించారు. ఫఆకునూరులో తెలుగురైతు నాయకుడు కాకాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి నిర్వహించారు. పార్టీ నాయకులు వెలగపూడి వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ గోలి వసంతకుమార్‌, తాతబ్బాయి, తోటశ్రీను, కాకాని రామచంద్ర రావు, త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం : పేదలకు కూడు, గూడు, గుడ్డ కిలో బియ్య రూ.2లకే అందజేసిన ఘనత నందమూరి తారకరామారావుకే దక్కుతుందని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ అన్నారు. గన్నవరంలో టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ పొట్లూరి బసవరావు, ప్రముఖ న్యాయవాది కెవి రమణ, చిమట రవివర్మ, దేవినేని సులోచన, చిక్కవరపు నాగమణి, చీమలదండు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ గన్నవరం టౌన్‌ పార్టీ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పార్టీ నాయకులు అరవపల్లి బోస్‌, తుల్లిమిల్లి ఝాన్సీ, కొమ్మరాజు సుధీర్‌, మద్దినేని వెంకటేశ్వరరావు, మోదుగుమూడి వేణు, జాస్తి ఫణిశేఖర్‌, కాట్రగడ్డ అరుణ, మండవ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ : రాజకీయాల్లో తనదైన శైలితో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్రవేసిన టీడీపీ వ్యవస్థాపకుడు, దివం గత నందమూరి తారకరామారావు కారణజన్ముడని టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిరుమామిళ్ల సూర్యం, మూల్పూరి సాయికల్యాణి, వేము లపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమావర ప్రసాద్‌, మండవ రవీంద్ర, వేగిరెడ్డి పాపారావు, మజ్జిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రవంతి చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ట్రస్ట్‌ చైర్మన్‌ వీరమాచనేని సత్య ప్రసాద్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. చిన్నాల లక్ష్మీనా రాయణ, గొట్టాపు వాసు, వీరమాచనేని బుజ్జి తదితరులు పాల్గొన్నారు. విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు స్థానిక పాల శీతల కేంద్రంలోని కార్యాలయంలోని సిబ్బందితో కలిసి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : సంక్షేమ పథకాలతో మానవత్వపు పరిమళాలద్దిన మహోన్నతుడు ఎన్టీఆర్‌ అని వేములపల్లి శ్రీని వాసరావు, లంక సురేంద్రమోహన బెనర్జీ, మండాది రవీంద్ర వేర్వేరు కార్యక్రమాల్లో కొనియాడారు. బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్‌ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లిలో రైతులతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి అధ్యక్షుడు వల్లూరిపల్లి నాని, అక్కినేని రవి, పొట్లూరి శ్రీధర్‌ తదిత రులు నివాళులర్పించారు. రంగన్నగూడెంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి ఎంపీటీసీ పుసు లూరి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ కసుకుర్తి రంగామణి, మొవ్వా వేణుగోపాల్‌ నివా ళులర్పించారు. ఆరుగొలనులో అధ్యక్షుడు బేతా శేషు కుమార్‌, తుమ్మల బ్రహ్మాజీ, వీరం రాంబాబు నివాళులర్పించారు. కాకు లపాడులో చలసాని శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, బిరయ్య, స్వామిదాసు ఎన్టీఆర్‌ జయంతి నిర్వహించారు. మల్లవల్లిలో యనమదల వెంకయ్యారావు, అక్కినేని ధర్మరాజు, కృష్ణాజీ, షేక్‌ జాన్‌బాషా తదితరులు ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివా ళులర్పించారు. వీరవల్లిలో లంక సురేంద్ర మోహనబెనర్జీ, గుండపనేని ఉమా వరప్రసాద్‌, కలపాని నాని, రాజాబాబు, మండాది రవీంద్ర, అమృతపల్లి సూర్యనా రాయణ, లంక అజయ్‌, పిల్లా రామారావు, తదితరులు నివాళులర్పిం చారు. వేలేరులో వేములపల్లి శ్రీనివాసరావు, వల్లూరి రాణి, దోనవల్లి బాపారావు, అవిర్నేని భవానిశంకర్‌, పోలగాని వెంకటేశ్వరరావు బాణావతుల శ్రీనివాసరావు, శ్రీకాకుళపు రాజేష్‌, జాకీర్‌కలాం బాషా తదితరులు పాల్గొన్నారు. కోడూరుపాడు, ఎ.సీతారాంపురం, మడిచర్ల, బొమ్ములూరు, కానుమోలు, బిళ్లనపల్లి తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

విజయవాడ రూరల్‌ : మండలంలోని అంబాపురంలో ఎన్టీఆర్‌ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొడ్డళ్ల చిన్నరామారావు, సత్యనారాయణ, కమలరాజు, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

గుణదల : తెలుగుజాతికి ఆణిముత్యం ఎన్టీఆర్‌ అని విజయవాడ రూరల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు గొడ్డళ్ల చిన్న రామారావు అన్నారు. ప్రసాదంపాడులోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడవల్లి నరసయ్య, బొప్పన హరికృష్ణ, సర్నాల బాలాజి, నబిగాని కొండ, గుజ్జర్ల బాబూరావు, పట్టపు చంటి, ఎన్‌.శ్రీదేవి, బొమ్మసాని అరుణ, యుగంధర్‌, పి.లలిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:57 AM