Share News

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:54 AM

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మూల్పూరి సాయికల్యాణి ప్రజలకు వివరించారు. సోమవారం రెడ్డమ్మనగర్‌లో జంక్షన్‌ పట్టణ టీడీపీ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంపై ప్రచారం నిర్వహించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం
రెడ్డమ్మనగర్‌లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు

హనుమాన్‌జంక్షన్‌, మార్చి 11 : వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మూల్పూరి సాయికల్యాణి ప్రజలకు వివరించారు. సోమవారం రెడ్డమ్మనగర్‌లో జంక్షన్‌ పట్టణ టీడీపీ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంపై ప్రచారం నిర్వహించారు. గన్నవరం టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు అభ్యర్ధిత్వాన్ని బలపర్చాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గార్లపాటి రాజే శ్వరరావు, యార్లగడ్డ సత్యనారయాణ, గుమ్మడి శేషగిరిరావు, వార్డు సభ్యులు తాడిశెట్టి శ్రీను. కడవకొల్లు రాజేష్‌, జనసేన మండల అధ్యక్షుడు వడ్డి శివనాగేశ్వరరావు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఫ పెనమలూరు : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయమని టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు పేర్కొన్నారు. సోమవారం కానూరు 29వ డివిజన్‌లో జరిగిన బాబుష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన స్థానిక నాయకులతో పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను వివరించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఆయన వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఫ ఉయ్యూరు : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో దళిత, బడుగు బలహీన వర్గాలు, పేదల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు దేవినేని గౌతమ్‌ అన్నారు. ఉయ్యూరు 15వ వార్డులో సోమవారం పర్యటించి బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఫ టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌, ఆరు గ్యారెంటీలతో అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌ కుమారుడు వెంకట్రామ్‌ అన్నారు. ముదునూరులో సోమవారం మూడవరోజు పర్యటించి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ, బీసీ డిక్లరేషన్‌, ఆరు గ్యారెంటీలు వివరించి టీడీపీకి ఓటు వేసి గెలిపిం చాలన్నారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు దూసర అజయ్‌కుమార్‌, సంగెపు రంగారావు, మొవ్వ జ్ఞానశేఖర్‌, పల్లపోతు శ్రీనివాసరావు, ఫణి, నాగరాజు, రామకోటయ్య, వంశీ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:54 AM