వైసీపీ మునిగిపోయే నావ: బోడె ప్రసాద్
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:48 AM
వైసీపీ మునిగిపోయే నావ అని ఆ పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, దీంతో ఆపార్టీ పెద్దలు అల్లాడుతున్నారని టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోడె ప్రసాద్ ఎద్దేవా చేశారు.

పెనమలూరు: వైసీపీ మునిగిపోయే నావ అని ఆ పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, దీంతో ఆపార్టీ పెద్దలు అల్లాడుతున్నారని టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోడె ప్రసాద్ ఎద్దేవా చేశారు. తాడిగపడలో గురువారం నిర్వహించిన బాబూ ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అఽధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. నేతలు ధనకోటేశ్వరరావు, బోడె వెంకట్‌రామ్, సెంగెపు రంగారావు, చిగురుపాటి మాలయ్య, అనుమోలు ప్రభాకర్, తోటకూర ఉదయ్‌భాస్కర్, షేక్ సైదులు, షేక్ సలీం, బొమ్మిడి నాగరాజు, వనమల ఆంజనేయులు పాల్గొన్నారు.
నేడు టీడీపీ - జనసేన ఆత్మీయ సమావేశం
టీడీపీ పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు టీడీపీ-జనసేన పార్టీల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు బోడె ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన వ్యూహం, ప్రణాళికపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.