Share News

రైతులు, చేనేతల సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం: వేదవ్యాస్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:52 AM

‘వైసీపీ పాలనలో పెడన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం. రైతు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. జగన్‌ చేతకాని పాలన వల్ల చేనేత సొసైటీలు తీవ్రంగా నష్టపోయాయి. టీడీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.’’ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ దుయ్యబట్టారు.

రైతులు, చేనేతల సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం: వేదవ్యాస్‌

పెడన, ఫిబ్రవరి 14: ‘‘వైసీపీ పాలనలో పెడన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం. రైతు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. జగన్‌ చేతకాని పాలన వల్ల చేనేత సొసైటీలు తీవ్రంగా నష్టపోయాయి. టీడీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.’’ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ దుయ్యబట్టారు. బుధవారం గూడూరు మండలంలోని రామరాజుపాలెం, దొడ్లపాలెం, ఆకుమర్రు, మల్లవోలు, రాయవరం, పోలవరం, ఐదుగుళ్లపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం తరకటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడినాక చేనేత పరిశ్రమ సమస్యలను పరిష్క రిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:52 AM