Share News

వార్డు సచివాలయ సిబ్బందితో పనులు..

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:38 AM

వార్డు సచివాలయం సిబ్బందితో పారిశుధ్యం పనులు చేయించేందుకు మునిసిపల్‌ అధికారుల ప్రయత్నాలను సమ్మె చేస్తున్న కార్మికులు గురువారం అడ్డుకున్నారు.

వార్డు సచివాలయ సిబ్బందితో పనులు..
మునిసిపల్‌ కార్యాలయం పారిశుధ్య కార్మికుల ఆందోళన

తిరువూరు, జనవరి 4 : వార్డు సచివాలయం సిబ్బందితో పారిశుధ్యం పనులు చేయించేందుకు మునిసిపల్‌ అధికారుల ప్రయత్నాలను సమ్మె చేస్తున్న కార్మికులు గురువారం అడ్డుకున్నారు. మునిసిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరింది. అధికారులు రోజువారి కూలీలతో పట్టణంలో పారిశుధ్య పనులు చేయించేందుకు గతంలో చేసిన ప్రయత్నాలను కార్మికులు అడ్డుకున్నారు. గురువారం శ్రమదానం పేరుతో సచివాలయం సిబ్బందితో పనులు చేయించే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకొని కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దాంతో చేసిదిలేక అధికారులు వెళ్లిపోయారు. నాయకులు సురేష్‌, నాగరాజు, రవి, నరసింహారావు, వేణు, విజయమ్మ, కుమారి, మణెమ్మ, సాంమ్రాజ్యం, వెంకటరమణ పాల్గొన్నారు.

నందిగామ: పట్టణ ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే తంగి రాల సౌమ్య అన్నారు. శిబిరానికి గురువారం వచ్చిన సౌమ్య వారికి మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన జగన్‌రెడ్డి వాటిని మరిచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ చేయటంలేదన్నారు. అనంతరం కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్‌లు పంపిణీ చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 12:38 AM