Share News

ఎఫ్‌ఏ అక్రమాలపై ఉపాధి కూలీల ఆందోళన

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:48 AM

జాతీయ ఉపాధి హామీ పథకం జరుగుతున్న అవినీతి పనులపై సమగ్ర విచారణ చేసి కన్నివీడు ఎఫ్‌ఏ చిట్టెమ్మపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం ఉపాధి కూలీలు ఆందోళన చేశారు.

ఎఫ్‌ఏ అక్రమాలపై ఉపాధి కూలీల ఆందోళన

వత్సవాయి, ఏప్రిల్‌ 18: జాతీయ ఉపాధి హామీ పథకం జరుగుతున్న అవినీతి పనులపై సమగ్ర విచారణ చేసి కన్నివీడు ఎఫ్‌ఏ చిట్టెమ్మపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం ఉపాధి కూలీలు ఆందోళన చేశారు. ఎఫ్‌ఏ చిట్టెమ్మ కూలీలు చేయాల్సిన పనిని యంత్రాలతో చేయించి అందుకు కూలీల వద్ద నుంచి రూ.250 వసూలు చేస్తుందని, ఉపాధి పనులకు హాజరు కాని కూలీలకు సైతం మస్తర్‌ వేస్తుందన్నారు. కూలీలు ఆరు రోజులు పని చేస్తే రెండు రోజులకు మస్తర్‌ వేస్తుందని, ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతుందని కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో భరత్‌రాజ్‌కు వినతిపత్రం అందించారు. ఎంపీడీవో మాట్లాడుతూ చిట్టెమ్మపై సమగ్ర విచారణ చేసి అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళన విరమించారు.

Updated Date - Apr 19 , 2024 | 12:48 AM