జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:54 AM
కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం టౌన్, జూలై 27: కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాలులో ఎమ్మె ల్యేలు, కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా అధికా రులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్‌రాజా, యార్లగడ్డ వెంకట్రావు, డీఆర్వో కె.చంద్రశేఖర రావు, ఆర్డీవో వాణి, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ విజయకుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసరావు, డీపీవో నాగేశ్వర నాయక్, సీపీవో గణేష్ పాల్గొన్నారు.
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభం
మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రి నేత్ర విభాగంలో రూ.కోటి విలువైన ఆధునిక వైద్య పరికరాలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. మెల్ల కన్ను సమస్యతో బాధపడేవారికి శస్త్రచికిత్స కోసం ఆస్ప్రత్రిలో పరికరాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్‌కుమార్, కంటి వైద్యుడు భానుమూర్తి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, మునిసిపల్ మాజీ చైర్మన్ బాబాప్రసాద్, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.