Share News

మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యం: యార్లగడ్డ

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:29 AM

ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు

మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యం: యార్లగడ్డ

గుణదల, మార్చి 8: మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని టీడీపీ-జనసేన కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రసాదం పాడులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు కేక్‌ కట్‌ చేసి, మహిళలను శాలువాలతో సత్కరించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జిల్లాపరిషత్తుల్లో తొమ్మిది శాతం అధ్యక్ష పద వులను మహిళలకు రిజర్వు చేస్తూ నందమూరి తారక రామారావు చట్టం చేశారని తెలిపారు. అప్పటి నుంచే స్థానిక సంస్థల్లో మహిళలు కీలక పదవీ బాధ్యతలు చేపట్టగలిగారన్నారు. ఆస్తి హక్కు, ఉన్నత విద్యావకాశాల కల్పనకు మహిళల అభ్యున్నతికి టీడీపీ పని చేస్తుందని తెలిపారు. తొలి మహిళా యూనివర్సిటీ, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రం గాల్లో మహిళలకు రిజర్వేషన్లు, వినూత్న పథకాలను ఎన్టీఆర్‌ పాలనలో అమలులోకి తెచ్చారన్నారు. మహిళా సాధికారతకు టీడీపీ నిలువెత్తు రూపంగా నిలిస్తే వైసీపీ దానిని తూట్లు పొడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మూల్పూరి సాయి కళ్యాణి, మేడేపల్లి రమ, పొదిలి లలిత, చిక్కవరపు నాగమణి, మండవ రమ్య కృష్ణ, బొమ్మసాని అరుణ, బుస్సే సరిత, దేవినేని సులోచన, గుడ్డేటి సుమతి, గుజ్జర్లపూడి అజిత, మల్లేశ్వరి, సుభాషిణి, శ్వేత, సాయి, గౌరి, సుకన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 01:30 AM