Share News

ముందస్తు గుర్తింపుతో బ్రెయిన్‌ ట్యూమర్‌ నివారణ

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:17 AM

ముందస్తుగా గుర్తిస్తే బ్రెయిన్‌ ట్యూమర్‌ను నివారించవచ్చునని రైల్వే ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎం.శౌరిబాల అన్నారు.

ముందస్తు గుర్తింపుతో   బ్రెయిన్‌ ట్యూమర్‌ నివారణ

ముందస్తు గుర్తింపుతో

బ్రెయిన్‌ ట్యూమర్‌ నివారణ

రైల్వే ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ శౌరిబాల

రైల్వేస్టేషన్‌, జూన్‌ 8: ముందస్తుగా గుర్తిస్తే బ్రెయిన్‌ ట్యూమర్‌ను నివారించవచ్చునని రైల్వే ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎం.శౌరిబాల అన్నారు. శనివారం వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ డే సందర్భంగా విజయవాడ రైల్వే ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బ్రెయిన్‌ ట్యూమర్‌ దాని లక్షణాలు, నివారణ తదితరాలను వివరించారు. ముందస్తు హెల్త్‌ చెకప్‌లు చాలా అవసరమని చెప్పారు. ఏసీఎంఎస్‌ డాక్టర్‌ ఎం.జయదీప్‌, రేడియేషన్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ సాయిస్నేహిత్‌, వైద్యురాలు డాక్టర్‌ హసీనా బేగం తదితరులు పోషకాహారం, జీవనశైలి తదితర అంశాల్లో అవగాహన కల్పించారు.

Updated Date - Jun 09 , 2024 | 12:17 AM