టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలే తొలగిస్తారా
ABN , Publish Date - Feb 24 , 2024 | 01:36 AM
నగరంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను మాత్రమే విద్యుత్, మునిసిపల్, కార్పొరేషన్ అధికారులు తొలగి స్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా వైసీపీ బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించడం లేదని తెలుగుయువత ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కిలారు శ్రావణ్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీవి తొలగించరా?: తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కిలారు శ్రావణ్
వన్‌టౌన్, ఫిబ్రవరి 23: నగరంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను మాత్రమే విద్యుత్, మునిసిపల్, కార్పొరేషన్ అధికారులు తొలగి స్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా వైసీపీ బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించడం లేదని తెలుగుయువత ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కిలారు శ్రావణ్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను చైతన్యం చేసేందుకు మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను చూసి వైసీపీ నాయకులు ఉలిక్కి పడ్డారన్నారు. శుక్రవారం బెంజ్‌సర్కిల్ వద్ద కార్పొరేషన్ అధికారుల ద్వారా బ్యానర్లను తొలగింపజేశారన్నారు. అధికార పార్టీకి చెందిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల జోలికి వెళ్లడం లేదని పేర్కొన్నారు. వైసీపీ బ్యానర్లన్నింటినీ ఈనెల 26 లోపు తొలగించకుంటే ప్రతి బ్యానర్ వద్ద తాము అందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.