Share News

న్యాయం జరిగేనా..?

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:16 AM

కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ను ఉన్నట్టుండి పటమట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆయన రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు చేపడతారనే సరికి హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు. ఆ ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపించారు. ఆగమేఘాల మీద మరో ఇన్‌స్పెక్టర్‌ను ఆ పోస్టులో నియమించారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటన ఇది. అసలు ఈవిధంగా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కొన్ని రోజులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించిన డీజీ స్థాయి అధికారి (ఇప్పుడు మాజీ)ని ఒక ఎస్‌ఐ పదవీ విరమణ వేడుకలో కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటో దిగారు. పోలీసు సంక్షేమ సంఘం స్థానంలో ఉన్న అడహక్‌ కమిటీలో ఉన్న నాయకుడు ఒకరు ఈ ఫొటోను బయటకు లీక్‌ చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ ఫొటో కారణంగా పటమటకు ముందుగా నియమించిన ఇన్‌స్పెక్టర్‌కు ఇప్పటి వరకు పోస్టింగ్‌ ఇవ్వలేదు.

న్యాయం జరిగేనా..?

వైసీపీ పాలనలో ఇన్‌స్పెక్టర్లకు ఇబ్బందులు

కొంతమందికి దక్కని పోస్టింగ్‌లు

ఇచ్చిన పోస్టింగ్‌లు వెంటనే రద్దు చేసిన అధికారులు

పోస్టింగ్‌ల కోసం వైసీపీ విధేయుల ప్రయత్నాలు

కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ను ఉన్నట్టుండి పటమట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆయన రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు చేపడతారనే సరికి హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు. ఆ ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపించారు. ఆగమేఘాల మీద మరో ఇన్‌స్పెక్టర్‌ను ఆ పోస్టులో నియమించారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటన ఇది. అసలు ఈవిధంగా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కొన్ని రోజులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించిన డీజీ స్థాయి అధికారి (ఇప్పుడు మాజీ)ని ఒక ఎస్‌ఐ పదవీ విరమణ వేడుకలో కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటో దిగారు. పోలీసు సంక్షేమ సంఘం స్థానంలో ఉన్న అడహక్‌ కమిటీలో ఉన్న నాయకుడు ఒకరు ఈ ఫొటోను బయటకు లీక్‌ చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ ఫొటో కారణంగా పటమటకు ముందుగా నియమించిన ఇన్‌స్పెక్టర్‌కు ఇప్పటి వరకు పోస్టింగ్‌ ఇవ్వలేదు.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ఒక ఇన్‌స్పెక్టర్‌కు పోలీసు శాఖలో సౌమ్యుడు అని పేరుంది. ఆయన వద్దకు ప్రముఖుల సిఫార్సులతో వెళ్లినా, మామూలుగా వెళ్లిన ఆయన మాట్లాడే విధానంలో మర్యాద మాత్రం తగ్గదు. ఆయన ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. ఐదేళ్లుగా ఆయనను ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టులో కూర్చోబెట్టారు. రెండు రోజుల క్రితమే పశ్చిమ మండలంలో ఒక స్టేషన్‌కు అటాచ్‌మెంట్‌ ఇచ్చారు. డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నప్పుడు ఆయన క్యాంపు ఆఫీసు నుంచి ఏ మార్గంలో డీజీపీ కార్యాలయానికి వెళ్తారో తెలిసేది కాదు. ఆయన కోసం పోలీసులు రెండు, మూడు మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేసుకునేవారు. ఒకసారి ఆయన ఒక మార్గంలో వెళ్తానని చెప్పి మరో మార్గంలో వెళ్లారు. ఆయన కాన్వాయ్‌ వస్తున్న సమయంలో ట్రాఫిక్‌ ఉండడంతో అక్కడున్న ఇన్‌స్పెక్టర్‌పై వేటు వేశారు. ఈ విషయం బయటకు రాకుండా వాహనదారులకు ఇబ్బంది కలిగించినందుకు ఆయనను సస్పెండ్‌ చేసినట్టు పోలీసు కమిషనర్‌ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేయించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్లు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఈ మూడు ఉదాహరణలు మచ్చుతునకలు మాత్రమే. నాటి పాలనలో ఉన్న అధికారులకు, పాలకులకు జీహుజూర్‌ అన్న వారిని అందలం ఎక్కించారు. ఆ ఇన్‌స్పెక్టర్లు ఎక్కడ కోరుకుంటే అక్కడ పోస్టింగ్‌లు ఇచ్చారు. కొంతమంది ఇన్‌స్పెక్టర్లకు పోలీసు కమిషనరేట్‌తో సంబంధం లేకుండా డీజీపీ క్యాంపు కార్యాలయం నుంచి రాత్రికిరాత్రి పోస్టింగ్‌లు ఇచ్చిన సందర్భాలున్నాయి. వైసీపీ ప్రజాప్రతినిధులకు, అధికారులకు వత్తాసు పలికిన ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌లు ఇవ్వడం కోసం నిబంధనలను ఉల్లంఘించారు. అప్పటి వరకు ఉన్న అధికారులను బలవంతంగా బదిలీ చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో పోస్టింగ్‌ల్లో వివక్ష ఎదుర్కొని అనేక ఇబ్బందులు పడిన ఇన్‌స్పెక్టర్లకు ఇప్పుడు న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతల మాటలను వేదంగా భావించి, వారితో అంటకాగిన వారి పేర్లను రెడ్‌బుక్‌లో రాశామని టీడీపీ నేతలు చెప్పారు.

గొడుగు మార్చుతున్నారు

వైసీపీ హయాంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి విధేయులుగా వ్యవహరించిన ఇన్‌స్పె క్టర్లు, వైసీపీ ప్రజాప్రతినిధుల మాటలను వేదాలుగా భావించి పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు ఇప్పుడు గొడుగు మార్చారు. ఆ ప్రభుత్వం హయాంలో తాము వివక్షను ఎదుర్కొన్నామని ఈసారి పోస్టింగ్‌ల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి ప్రజాప్రతినిధుల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రాధాన్య పోస్టుల్లో కూర్చున్న ఇన్‌స్పెక్టర్లు ఇప్పుడు స్థానం మారినా ఆ ప్రాఽధాన్యాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇదే కనుక కార్యరూపం దాల్చితే నాడు ఇబ్బందులు పడిన ఇన్‌స్పెక్టర్లకు న్యాయం జరగదన్న భావన పోలీసు వర్గాల్లో ఉంది. ఈ అంశాన్ని కూటమి ప్రజాప్రతినిధులు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 01:16 AM