Share News

దీన్నేమందురు..?

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:19 AM

వాంబేకాలనీకి చెందిన చిన్నం రవి కూలి పనులు చేస్తుంటాడు. ఈనెల 3వ తేదీ ఉదయం ఇంట్లో నుంచి పనికని వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం చూసేసరికి మద్యం మత్తులో సైడ్‌ కాల్వలో పడి మృతిచెందాడు. సోమయ్య.. వాంబేకాలనీలో నివాసముంటున్నాడు. గత నెల 2వ తేదీ వాంబేకాలనీలోని హిందూ శ్మశానవాటికలో ఉన్న చిమ్నీపైకెక్కి వీరంగం వేశాడు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కిందకు రాలేదు. చివరకు పోలీసులు మద్యం సీసాలు కొని చూపించడంతో కిందకు దిగాడు. గతనెల.. ప్రభుత్వ వైన్‌షాపులో పనిచేస్తున్న సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు అక్రమంగా మద్యం తరలిస్తూ నున్న రూరల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రభుత్వ వైన్‌షాపు నుంచి మద్యం బాటిళ్లను వేరేచోట విక్రయిస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా చెప్పుకొంటే పోతే ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో భార్యాభర్తల మధ్య గొడవలకు మద్యమే కారణమని చాలా కేసుల్లో స్పష్టమవుతోంది. ..తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని, అక్కాచెల్లెమ్మల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా చేసి స్టార్‌ హోటళ్లకు పరిమితం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీని మరిచిపోయారు. కానీ, పశ్చిమ సిటింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ సెంట్రల్‌ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్‌ మాత్రం నియోజకవర్గంలో కీలకమైన మద్యపాన నిషేధాన్ని గాలికొదిలి.. తమ అధినేత ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారని చెప్పుకొంటూ ప్రచారం చేస్తుండటాన్ని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

దీన్నేమందురు..?

‘సెంట్రల్‌’లో ఫుల్లుగా తాగేస్తున్న మందుబాబులు

కీలకమైన మద్యపాన నిషేధం మాటెత్తని వెలంపల్లి

జగన్‌ హామీలన్నీ నెరవేర్చారంటూ గారడీ మాటలు

అసలు సెంట్రల్‌లో కీలకమైన సమస్యే మద్యపానం

వైసీపీ వచ్చాక పెరిగిన బార్లు, వైన్‌ షాపులు

పోలీస్‌ కేసుల్లో చాలావరకు మందు తాగి కొట్టుకున్నవే..

తెల్లవారితే చాలు.. రోడ్లపైనే సురాపానం

అసలు విషయాన్ని దాచేసి వెలంపల్లి కల్లబొల్లి కబుర్లు

వాంబేకాలనీకి చెందిన చిన్నం రవి కూలి పనులు చేస్తుంటాడు. ఈనెల 3వ తేదీ ఉదయం ఇంట్లో నుంచి పనికని వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం చూసేసరికి మద్యం మత్తులో సైడ్‌ కాల్వలో పడి మృతిచెందాడు.

సోమయ్య.. వాంబేకాలనీలో నివాసముంటున్నాడు. గత నెల 2వ తేదీ వాంబేకాలనీలోని హిందూ శ్మశానవాటికలో ఉన్న చిమ్నీపైకెక్కి వీరంగం వేశాడు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కిందకు రాలేదు. చివరకు పోలీసులు మద్యం సీసాలు కొని చూపించడంతో కిందకు దిగాడు.

గతనెల.. ప్రభుత్వ వైన్‌షాపులో పనిచేస్తున్న సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు అక్రమంగా మద్యం తరలిస్తూ నున్న రూరల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రభుత్వ వైన్‌షాపు నుంచి మద్యం బాటిళ్లను వేరేచోట విక్రయిస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా చెప్పుకొంటే పోతే ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో భార్యాభర్తల మధ్య గొడవలకు మద్యమే కారణమని చాలా కేసుల్లో స్పష్టమవుతోంది.

..తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని, అక్కాచెల్లెమ్మల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా చేసి స్టార్‌ హోటళ్లకు పరిమితం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీని మరిచిపోయారు. కానీ, పశ్చిమ సిటింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ సెంట్రల్‌ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్‌ మాత్రం నియోజకవర్గంలో కీలకమైన మద్యపాన నిషేధాన్ని గాలికొదిలి.. తమ అధినేత ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారని చెప్పుకొంటూ ప్రచారం చేస్తుండటాన్ని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

అజిత్‌సింగ్‌నగర్‌ : నగరానికి శివారు ప్రాంతాలైన సెంట్రల్‌ నియోజకవర్గంలోని అజిత్‌సింగ్‌నగర్‌, న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, పాయకాపురం, రాధానగర్‌, కండ్రిక తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పేద, బడుగు, బలహీన వర్గాలవారు నివాసముంటారు. రెక్కాడితే గాని డొక్కాడని వారి రోజువారీ ఆదాయం అంతంతమాత్రమే. గత టీడీపీ ప్రభుత్వంలో కూలీనాలీ చేసి ఉన్న దానిలోనే ఇంటికి వెళ్లే ముందు ఓ మద్యం సీసా కొని, కూలి డబ్బు భార్యకు ఇచ్చి తాగి పడుకునేవారు. ఉదయాన్నే పనికి వెళ్లడం, రాత్రి ఎప్పుడో తాగి ఇంటికి రావడం జరిగేది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వచ్చే కూలీ డబ్బు మద్యం సీసాలకే సరిపోతోంది. ఆదాయంలో సగానికిపైగా మద్యం సీసాలకే ధారపోస్తున్నారు.

పెరిగిన బార్లు, వైన్‌ షాపులు

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక సెంట్రల్‌ నియోజవర్గంలో బార్లు, వైన్‌ షాపుల సంఖ్య బాగానే పెరిగింది. ఇక ప్రభుత్వ వైన్‌ షాపులు అమ్మకాల్లో బార్లతో పోటీ పడుతున్నాయి. నిబంధనల ప్రకారం వైన్‌ షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మకాలు సాగిస్తుండగా, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తీసి ఉంచాల్సి ఉంది. కానీ, ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. తెల్లవారుజాముప 5 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు అమ్మకాలు సాగిస్తున్నారు.

అసలు సమస్య వదిలి.. వెలంపల్లి గారడీ ప్రసంగాలు

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ గారడీ ప్రసంగాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, మళ్లీ వైసీపీని గెలిపించాలని ప్రసంగిస్తున్నారే తప్ప.. ఆయా ఏరియాల్లో ప్రధానంగా ఉన్న మద్యపానంపై మాట కదపకపోవడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

నిలువునా ముంచేశారు..

మద్యంపాన నిషేధం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌ మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి రుణాలు మాత్రం పొందుతున్నాడు. నాసిరకమైన మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు.

- బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే

హామీల అమలేదీ..?

మద్యపాన నిషేధం అమలుపై వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సెంట్రల్‌ నియోజకవర్గంలో అదనపు బార్లు, వైన్‌ షాపులు ఏర్పాటు చేయడంతో ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి. గొంతెత్తి ప్రశ్నించిన మహిళలపై అక్రమ కేసులు నమోదు చేశారు. మద్యంతో వచ్చే ఆదాయంపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై లేదు.

- సీహెచ్‌ బాబూరావు, సీపీఎం నాయకుడు

Updated Date - Feb 13 , 2024 | 01:19 AM