Share News

జనసేనానికి జన స్వాగతం

ABN , Publish Date - May 10 , 2024 | 01:23 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌ షోతో జోష్‌ మీదున్న కూటమి కార్యకర్తలకు రెట్టింపు ఉత్సాహం కలిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నగరంలో గురువారం నిర్వహించిన రోడ్‌ షో డబుల్‌ ఇంజన్‌ జోష్‌ను నింపింది. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నేతలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనగా, పంజా సెంటర్‌ బహిరంగ సభలో పవన్‌ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపింది.

జనసేనానికి జన స్వాగతం

నగరంలో పవన్‌ రోడ్‌ షో గ్రాండ్‌ సక్సెస్‌

భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు

పంజా సెంటర్‌ బహిరంగ సభకు పోటెత్తిన జనం

మూడు నియోజకవర్గాల్లో సాగిన రోడ్‌ షో

సెంట్రల్‌లో బొండా ఉమా ఘన స్వాగతం

వెలంపల్లి, కర్నాటి రాంబాబుపై ఘాటైన విమర్శలు

పోతిన మహేశ్‌కు చురకలంటించిన పవన్‌

అమరావతి కోసమే ‘పశ్చిమ’ను వదులుకున్నామని వివరణ

ముస్లింలకు కొండంత అండగా ఉంటానని భరోసా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌ షోతో జోష్‌ మీదున్న కూటమి కార్యకర్తలకు రెట్టింపు ఉత్సాహం కలిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నగరంలో గురువారం నిర్వహించిన రోడ్‌ షో డబుల్‌ ఇంజన్‌ జోష్‌ను నింపింది. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నేతలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనగా, పంజా సెంటర్‌ బహిరంగ సభలో పవన్‌ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపింది.

విజయవాడ, మే 9 (ఆంధ్రజ్యోతి) : బందరురోడ్డులోని పశువుల ఆసుపత్రి జంక్షన్‌ నుంచి నైస్‌బార్‌ సెంటర్‌, విశాలాంధ్ర రోడ్డు, ఏలూరు రోడ్డు, లోబ్రిడ్జి మీదుగా పంజా సెంటర్‌ వరకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ర్యాలీ జరిగింది. శిఖామణి సెంటర్‌ వద్ద సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ రోడ్‌ షో చివరి వరకు ఉన్నారు. ఇక పంజా సెంటరులో నిర్వహించిన సభలో పవన్‌ నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించారు. పరిష్కారానికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేస్తానన్నారు. ముస్లింల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

అమరావతి కోసమే పశ్చిమను వదులుకున్నాం : పవన్‌

పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాల్సి ఉందని పవన్‌ పేర్కొన్నారు. అయితే, ఈ సీటును బీజేపీ నేతలు కోరారని, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అమరావతిని రాజధాని చేయాలని కోరగా, కేంద్ర నాయకత్వం సరేనని అంగీకరించిందన్నారు. అందువల్ల ఈ సీటును త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన ఉందని తాను చెప్తే ఎవరూ నమ్మలేదని, నరేంద్రమోదీ ఇదే విషయాన్ని చెప్పారన్నారు. పశ్చిమలో జనసేన బలంగా ఉందన్నారు. విజయవాడలో శాంతిభద్రతలు బలంగా ఉండాలని పవన్‌ అభిప్రాయపడ్డారు. అందుకే తాము పెంచిన నేతలు తిడుతున్నా పడుతున్నామన్నారు. త్వరలో సుజనా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పోతిన మహేశ్‌ అంటే పశ్చిమ ప్రజలకు తెలియదని, నాయకుడిగా తయారు చేసింది తానేనని చెప్పారు. ఇప్పుడాయన వైసీపీ మాయలో పడి తనను దూషిస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి వెలంపల్లి హయాంలో దుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయమయ్యాయని గుర్తుచేశారు. కాల్‌మనీ కేసుల్లో నిందితుడ్ని దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్‌ చేశారని విమర్శించారు. ఒక కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి కట్టు వేసుకుని ఆస్కార్‌ నటన చేస్తున్నాడని వెలంపల్లిని ఎద్దేవా చేశారు. ఎవరో విసిరిన రాయి 360 డిగ్రీల్లో తిరిగి ఆయనకు తగిలిందన్నారు. వెలంపల్లి చేసిన నటన తాను సినిమాల్లోనూ చేయలేదన్నారు.

అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తా..

ఉత్తరాంధ్రలోని ఉద్దానంలో కిడ్నీ సమస్య వంటిది పశ్చిమలోనూ ఉందన్నారు. ఇక్కడున్న కొండ ప్రాంతవాసులు ఎక్కువగా పక్షవాతం బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇది ఎందుకు వస్తుందో పరిశోధన చేయించి సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. డ్రెయినేజీలో ఎక్కడికక్కడ దుర్గంధం పేరుకుపోయిందన్నారు. ఆ సమస్యను సరిచేసే బాధ్యత కూటమి తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్‌, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ, జలీల్‌ఖాన్‌, ఎంకే బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2024 | 01:23 AM