Share News

టీడీపీతో సమన్వయంతో పనిచేస్తాం

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:25 AM

నియోజకవర్గ అభివృద్ధికి జనసేన, టీడీపీ సమన్వయంతో పనిచేస్తాయని జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా అన్నారు.

టీడీపీతో సమన్వయంతో పనిచేస్తాం
బోడె ప్రసాద్‌ను సత్కరిస్తున్న జనసేన నాయకుడు ముప్పా రాజా తదితరులు

జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా

కంకిపాడు: నియోజకవర్గ అభివృద్ధికి జనసేన, టీడీపీ సమన్వయంతో పనిచేస్తాయని జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా అన్నారు. పోరంకి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన బోడె ప్రసాద్‌ను కలిసి ఆయన ఘనంగా సత్కరించారు. జనసేన నాయకులు బాయిన నాగరాజు, సుంకర శివ, పచ్చిపాల శేఖర్‌, సుంకర సురేష్‌, మేదండ్రావు సతీష్‌, గుంటా గంగాధర్‌ పాల్గొన్నారు. బోడె ప్రసాద్‌కు టీడీపీ మద్దూరు నాయకులు సత్కారం చేశారు. యన మదల మదన్‌, వై.వెంకటేశ్వరరావు, రాజేష్‌, వై.సత్యనారాయణ, తీట్ల మధు, పామర్తి నాని, ఆరేపల్లి గోపి, వీరంకి బాలకృష్ణ, వల్లె నరసింహా రావు, లింగాల వెంకటస్వామి పాల్గొన్నారు.

ఉయ్యూరులో టీడీపీకి 7,102 ఓట్ల ఆధిక్యం

ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలోని 20వార్డుల్లో కలిపి బోడె ప్రసాద్‌కు 7,102 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 37 పోలింగ్‌ బూత్‌లకు గాను 32 బూత్‌లలో బోడె ప్రసాద్‌కు ఆధిక్యం వచ్చింది. 242 నంబరు బూత్‌ లో బోడె ప్రసాద్‌ 398 ఓట్ల మెజారిటీ సాధించారు. వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్‌కు 259 నంబరు బూత్‌లో 16, 262 నంబరు బూత్‌లో 39, 266 నంబరు బూత్‌లో 172, 269 నంబరు బూత్‌లో 220, 272 నంబరు బూత్‌లో 9 ఓట్లు అధికంగా వ చ్చాయి. 242 నంబరు బూత్‌లో అత్యధిక మెజారిటీ సాధించినందుకు బోడె ప్రసాద్‌కు 16వ వార్డు ఇన్‌చార్జ్‌ ఈడే అంజిబాబు, ఆరేపల్లి సుబ్బారావు, చలపాటి శ్రీను, ముచ్చు సుదర్శన రావు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 01:25 AM