త్వరలో స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తాం
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:03 AM
నగరంలో త్వరలోనే స్ర్టామ్ వాటర్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు.

త్వరలో స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తాం
ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె
భారతీనగర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నగరంలో త్వరలోనే స్ర్టామ్ వాటర్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు పరిధి నాల్గవ డివిజన్ గురునానక్ కాలనీలోని గురుద్వార్ మెయిన్ రోడ్డులో గరువారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్‌లు పర్యటించారు. అనంతరం రూ.35 లక్షల వయ్యంతో ఏర్పాటు చేసే సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు పట్టుపట్టి ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయి నేజీ, సైడు కాల్వల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ గురుద్వార్ రోడ్డును సుమారు రూ.35 లక్షల అంచనా వయ్యంతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణ పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహేంద్రసింగ్ సహనీ, పరన్ దీప్‌సింగ్, కుల్దీప్‌కౌర్, మన్మోహన్ సింగ్, అరవింద్ సింగ్, కుల్దీప్‌సింగ్, రాజమణి, చలసాని రమణ, కోడూరు ఆంజనేయులు వాసు, సాంబశివరావు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.