అంగన్వాడీల శక్తి.. జగన్‌కు చూపిస్తాం
ABN , Publish Date - Jan 04 , 2024 | 12:27 AM
అంగన్వాడీ కార్యకర్తల నిర్బంధంతో నందిగామ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
నందిగామ, జనవరి 3: అంగన్వాడీ కార్యకర్తల నిర్బంధంతో నందిగామ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుధవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిలువరించేందుకు పోలీసులు అంగన్వాడీ నేతలపై రెండు రోజులుగా నిఘా పెట్టారు. తెల్లవారుజాము నుంచి పోలీసులు రోడ్లపైకి వచ్చి వాహనాల తనిఖీ చేపట్టారు. దొరికిన వారిని స్టేషన్‌కు తరలించారు. భారీగా తరలించడంతో నిలబడేందుకు నీడ లేక మహిళలలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టేషన్ ఆవరణలో నేలపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షుగర్, బీపీలు ఉన్నాయని, ఇంత సేపు కూర్చొనలేమని, వదిలేస్తే ఇంటికి వెళతామని పోలీసులను బతిమాలినా వారు పట్టించుకోలేదు. ఒక దశలో పోలీసుతో అంగన్వాడీలు వాగ్వాదానికి దిగారు. నియంతృ త్వంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు అంగన్వాడీల శక్తి రుచి చూపిస్తామని హెచ్చరించారు. పోలీసుల నిర్బం ధంతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.
జగ్గయ్యపేట: కలెక ్టరేట్ ముట్టడికి వెళ్లకుండా అంగన్‌వాడీ వర్కర్లను జగ్గయ్యపేట పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను తనిఖీలు చేసి, అంగన్వాడీలను స్టేషన్‌కు తరలించారు. జగ్గయ్యపేట స్టేషన్ ఎదుట వారు ఆందోళన చేశారు.
జగ్గయ్యపేట రూరల్ : ఉద్యోగాలు తీసేస్తామని ప్రభుత్వం బెదిరించటం సబబు కాదని అంగన్వాడీలు అన్నారు. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా విజయవాడ బయల్దేరిన వారిని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని చిల్లకల్లు పాలశీతలీకరణ కేంద్రం కల్యాణ మండపానికి తరలించారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు వెళ్తున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచటంతో పాటు సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన ఆపమన్నారు.
పురుగుల మందు తాగి తల్లీ కూతురు ఆత్మహత్యాయత్నం
ఉంగుటూరు, జనవరి 3 : సెల్‌ఫోన్‌లో ముచ్చట్లు వద్దని వారించినా, కుమార్తె వినకపోవడంతో తీవ్రమనోవేదనకు గురైన తల్లి పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, అదే సమయంలో కూతురు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని పెదఅవుటపల్లిలో మంగళవారం జరిగింది. ఆత్కూరు ఎస్సై టి.సూర్యశ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి ఆశ్రమం కాలనీలో కొప్పుల సురేష్‌కుమార్ భార్య విజయభారతి, కుమార్తె శ్రీనిధితో నివాసముంటున్నాడు. కుమార్తె స్ధానిక కాన్వెంట్‌లో 9వ తరగతి చదువుతోంది. ఈ నేపఽథ్యంలో శ్రీనిఽధి(14)సెల్‌ఫోన్‌లో అతిగా మాట్లాడటం తల్లి విజయభారతి (35) గమనించింది. కూతురుని వారించింది. వినకపోవడంతో పెదఅవుటపల్లిలోని బ్రదర్ జోసఫ్‌తంబి పుణ్యక్షేత్రానికి తీసుకొచ్చింది. అక్కడ పలువిధాలుగా నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా కూతురు వినకపోవటంతో, మనస్తాపం చెందిన తల్లి విజయభారతి వెంట తెచ్చుకున్న పురుగుల మందు కూల్‌డ్రింక్‌లో కలిపి తాగింది. నీతోపాటే నేను అంటూ మిగిలిన మందును కూతురు తాగేసింది. ముందుగా శ్రీనిధికి వాంతులవుతుండటంతో భయపడిన విజయభారతి అజ్జంపూడిలోని తన తమ్ముడు చినబాబుకు ఫోన్‌చేసి పురుగులమందు తాగిన విషయం చెప్పింది. వెంటనే సదరు ప్రదేశానికి చేరుకున్న చినబాబు అపస్మారకస్థితికి చేరిన అక్క, మేనకోడలిని స్ధానికుల సాయంతో చినఅవుటపల్లిలోని పిన్నమనేని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యాధికారులు చెప్పినట్లు ఎస్సై తెలిపారు.