ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:00 AM
అమరావతి రాజధానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.

గుణదల, జూలై 7: ‘‘అమరావతి రాజధానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేస్తారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన భేటీలో అనేక ప్రాజె క్టులు ఆమోదం పొందాయి. విజయవాడలో ఇప్పుడు ఉన్న ఫ్లైఓవ ర్‌కు అనుసంధానంగా ప్రభుత్వ హాస్పిటల్ వద్ద నుంచి నిడమా నూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.’’ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కరెన్సీనగర్లోని స్థల యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లక్ష్మీఫౌండేషన్ హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చే శారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడారు. విజయవాడ కార్పొరేషన్‌పై భారం పడకూడదన్న ఆలోచనతో జీతాలను 010 ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. నెలకు రూ.18కోట్ల భారం కార్పొరేషన్‌కు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, వంగల కృష్ణప్రసాద్, మురళీకృష్ణ, బాయన బాబ్జి, గద్దె రమేష్, తిరుమల విశ్వే శ్వరరావు, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల బలమైన కోరికతోనే కూటమికి అధికారం: గద్దె రామ్మోహన్
మొగల్రాజపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం బాగుపడుతుందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ప్రజలు నమ్మి ఓట్లేశారని, పదివేల ఓట్ల మెజార్టీ వస్తేనే గొప్పగా చె ప్పుకొనే ఈ రోజుల్లో మూడోసారి పోటీలో ఉన్న తనకు యాభైవేల పైన మెజార్టీ వచ్చిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 8వ డివిజన్ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఉన్న జీఈవీ రాధామాధవ్ అపార్టుమెంట్‌వాసులు అపార్టుమెంట్ ఆవరణలో ఆదివారం గద్దె రామ్మోహన్‌కు ఆయన భార్య జడ్పీ మాజీ చైర్‌పర్సన్ అనురాధకు ఆత్మీయ సన్మానం చేశారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వక పోయినా పోలవరం పూర్తికాకుండా అడ్డుకునే కుట్రలు ఇంకా చేస్తూనే ఉందని గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అపార్టుమెంట్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, అనూప్, సీతారామరాజు, శిరీష్, ఏవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.