Share News

కూటమి ప్రభుత్వమొచ్చాక ఏలూరు కాల్వపై వంతెన నిర్మిస్తాం

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:32 AM

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏలూరు కాల్వపై రామవరప్పాడులో వంతెన నిర్మిస్తామని కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంక ట్రావు సతీమణి జ్ఞానేశ్వరి గ్రామ ప్రజ లకు హామీ ఇచ్చారు.

 కూటమి ప్రభుత్వమొచ్చాక ఏలూరు కాల్వపై వంతెన నిర్మిస్తాం
రామవరప్పాడు రాజుల బజారులో ఎన్నికల ప్రచారం చేస్తున్న యార్లగడ్డ జ్ఞానేశ్వరి, టీడీపీ నేతలు

రామవరప్పాడువాసులకు యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి హామీ

గుణదల, ఏప్రిల్‌ 1: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏలూరు కాల్వపై రామవరప్పాడులో వంతెన నిర్మిస్తామని కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంక ట్రావు సతీమణి జ్ఞానేశ్వరి గ్రామ ప్రజ లకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం సోమవారం రామవర ప్పాడు చేరుకున్న ఆమె పేరంటాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం రైవస్‌ కాల్వపై వంతెన నిర్మాణం చేపట్టారని, ఈసారి ఏలూరు కాల్వపై డబుల్‌లైన్‌ వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం సూపర్‌ సిక్స్‌ పథకాలను పెట్టా రని, యార్లగడ్డ వెంకట్రావు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం సూపర్‌ సిక్స్‌ పథకాలను రూపొందించారని అందులో రామవరప్పాడు వంతెన సమ స్య కూడా ఉందని తెలిపారు. టీడీపీ నాయకులు కొల్లా ఆనంద్‌, బొమ్మ సాని అరుణ, తుపాకుల శివలీల, కొంగన రవి, అద్దేపల్లి సాంబశివనాగరాజు, కళ్లేపల్లి నాగరాజు, అడ్డగిరి రామకృష్ణ, నాభిగాని కొండ, విజ్జి రాము, మున్నాగి సత్యన్నారాయణ, పట్టపు చంటి, కురమద్దాలి ఫణికుమార్‌, లక్కు రాజు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 01:32 AM