Share News

విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:54 AM

రాష్ర్ట్రంలోని విద్యారంగంలో అపూర్వ సంస్కరణలను తీసుకొచ్చామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కే హేమచంద్రారెడ్డి అన్నారు.

విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం
ప్రసంగిస్తున్న హేమచంద్రారెడ్డి

విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం

విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి

వన్‌టౌన్‌, మార్చి 28: రాష్ర్ట్రంలోని విద్యారంగంలో అపూర్వ సంస్కరణలను తీసుకొచ్చామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కే హేమచంద్రారెడ్డి అన్నారు. కేబీఎన్‌ కళాశాల 59 వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గించారు. విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా వారిలోని నైపుణ్యాలను పెంపొందించేందుకు సంస్కరణలు దోహదం చేస్తాయన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను అందిపుచ్చుకుని అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ టి. హరికృష్ణ. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టీ. శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. నారాయణరావులు తమ సందేశాలలో విద్యార్థి ప్రగతికి తీసుకోవాల్సిన అంశాలను సూచించారు. సహాయ కార్యదర్శి జీవీ రామరావు, కోశాధికారి అన్నం రామకృష్ణారావు, హిందూ హైస్కూల్‌ కమిటీ ప్రతినిధులు, అధ్యాపకులు పలువురు పాల్గొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలతో అలరించారు.

Updated Date - Mar 29 , 2024 | 12:54 AM