Share News

ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: సీఐ

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:16 AM

రానున్న ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని గవర్నరుపేట సీఐ డి.వి రమణ సూచించారు.

ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: సీఐ
మాట్లాడుతున్న సీఐ రమణ

ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: సీఐ

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 4: రానున్న ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని గవర్నరుపేట సీఐ డి.వి రమణ సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు గవర్నరుపేట సీఐ డి.వి రమణ, ఎస్‌ఐ నారాయణమ్మ సిబ్బందితో కలిసి గురువారం హనుమాన్‌పేట ఏరియాలో ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనలు అమలులో ఉండడం వలన ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎలక్షన్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు పాటించాల్సిన విధివిధానాలను వివరించారు.

మహిళకు బ్యాగు అప్పగింత

ఆటోలో మరచిపోయిన బ్యాగును కొన్ని గంటలలోనే వెతికి బాధితురాలు సయ్యద్‌ ఇర్షద్‌కు గురువారం గవర్నరుపేట సీఐ డి.వి రమణ అప్పగించారు. ఆగిరిపల్లికి చెందిన సయ్యద్‌ ఇర్షద్‌ బందర్‌రోడ్డులోని ఓ వస్త్రదుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేసి చల్లపల్లి బంగ్లా వద్ద హడావుడి ఆటో దిగుతూ వస్త్రాల బ్యాగు మరిచిపోయింది. ఆటో కనిపించకపోవడంతో గవర్నరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ డి.వి రమణ వెంటనే స్పందించి ఆయన పర్యవేక్షణలో ఎస్‌ఐ నారాయణమ్మ తన సిబ్బందితో చల్లపల్లి బంగ్లా వద్దకు వెళ్లి పలువురు ఆటో డ్రైవర్‌లను వివరాలు అడిగి తెలుసుకుని ఆటోలో మరిచిపోయిన బ్యాగును పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీఐ పర్యవేక్షణలో ఆ బ్యాగును ఇర్షద్‌కు అందజేశారు.

Updated Date - Apr 05 , 2024 | 12:16 AM