Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ఓటరు జాబితా పరిశీలనపై అవగాహన

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:46 AM

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భవిష్యత్తు కార్యాచరణ, ఓటరు జాబితాలు, ఓటరు వెరిఫికేషన్లపై పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అవగాహన కల్పించారు.

 ఓటరు జాబితా పరిశీలనపై అవగాహన
పోరంకిలో టీడీపీ శ్రేణులకు అవగాహన కల్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

పెనమలూరు, మార్చి 2 : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భవిష్యత్తు కార్యాచరణ, ఓటరు జాబితాలు, ఓటరు వెరిఫికేషన్లపై పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అవగాహన కల్పించారు. శనివారం పోరంకి టీడీపీ కార్యాలయంలో ఆరవ క్లస్టరు శ్రేణులకు, శుక్రవారం 1,2క్లస్టర్ల శ్రేణులకు పార్టీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, సంగెపు రంగారావు, యార్లగడ్డ సుచిత్ర, షేక్‌ బుజ్జిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన శ్రేణులతో కలిసి ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్‌ ప్రసాద్‌ హాజరయ్యారు.

తోపుడు బండి అందజేత

టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ కార్యదర్శి మొక్కపాటి శ్రీనివాస్‌, ప్రసన్నకుమారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా యనమలకుదురుకు చెందిన నిరుపేద చంద్రశేఖర్‌ అనే వ్యక్తికి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ చేతుల మీదుగా తోపుడు బండిని అందజేశారు. కార్యక్రమంలో అనంతనేని చంద్రశేఖర అజాద్‌, సంగెపు రంగారావు, సంపర శేఖర్‌, సుబ్బు, లంకా కృష్ణసాయి, శేఖర్‌, పీతా గోపీచంద్‌, పాదాల ప్రభాకర్‌, పండల రజిని, సరస్వతి పాల్గొన్నారు.

టీడీపీ మేనిఫెస్టోతో రాష్ర్టానికి మేలు

టీడీపీ మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు అమితమైన మేలు జరుగుతుందని టీడీపీ నాయకులు దేవినేని గౌతమ్‌ దంపతులు పేర్కొన్నారు. శనివారం పోరంకి కట్టపై జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజలతో మాట్లాడారు. మేనిఫెస్టోలోని అంశాలతో రాష్ట్రంలోని మహిళలకు మరింత మేలు జరగుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లమీద తాము నిలబడేందుకు మేనిఫెస్టో దోహదపడుతుందని పేర్కొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:46 AM