Share News

వీఎంసీ ఆదాయానికి గండి!

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:22 AM

విజయవాడ మున్సిపల్‌ అధికారుల చేతివాటం కారణంగా వీఎంసీకి దక్కాల్సిన సుమారు కోటి రూపాయల ఆదాయానికి గండి పడింది. గవర్నరుపేటలోని ఎన్టీఆర్‌ - ఏఎంసీ కాంప్లెక్సుల్లో షాపులను అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించిన టెండర్లలో భారీఎత్తున అవినీతి చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో షాపుల పాటదారులతో సంబంధిత విభాగం అధికారులు కుమ్మ క్కుకావడంతో లక్షలాది రూపాయలు చేతులు మారగా వీఎంసీ ఆదాయానికి మాత్రం భారీగా గండిపడింది.

వీఎంసీ ఆదాయానికి గండి!

ఎన్టీఆర్‌ - ఏఎంసీ కాంప్లెక్సు దుకాణాల వేలంలో చేతివాటం

పాటదారులతో అధికారులు కుమ్మక్కు

రూ.కోటి ఆదాయానికి సున్నం

విజయవాడ మున్సిపల్‌ అధికారుల చేతివాటం కారణంగా వీఎంసీకి దక్కాల్సిన సుమారు కోటి రూపాయల ఆదాయానికి గండి పడింది. గవర్నరుపేటలోని ఎన్టీఆర్‌ - ఏఎంసీ కాంప్లెక్సుల్లో షాపులను అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించిన టెండర్లలో భారీఎత్తున అవినీతి చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో షాపుల పాటదారులతో సంబంధిత విభాగం అధికారులు కుమ్మ క్కుకావడంతో లక్షలాది రూపాయలు చేతులు మారగా వీఎంసీ ఆదాయానికి మాత్రం భారీగా గండిపడింది.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ కాంప్లెక్సులోని కింది అంత స్తులో మీసేవా కేంద్రాన్ని గతంలో ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా మీసేవా కేంద్రం ఖాళీగా ఉంటోంది. దీంతో మీసేవా కేంద్రం స్థానంలో షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ) ఎస్టేట్‌ అధికారులు మీసేవా కేంద్రాన్ని నాలుగు షాపులుగా మార్చి వాటికి 59, 60, 61, 62 నెంబర్లను కేటాయించారు. అఽధికారులు ఈనెల 23న సత్యనారాయణపురంలోని ఎస్టేట్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో షాపులను అద్దెకివ్వడానికి టెండర్లు పిలిచారు. గుడ్‌విల్‌గా రూ.5,99,400, ఈఎండీగా రూ.1,49,850 నిర్ణయించారు.

అద్దె నెలకు రూ.16,650 పెట్టారు. షెడ్యూలు ఖరీదు జీఎస్టీతో కలిసి రూ.3,500గా నిర్ణయించారు. వేలంపాటలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు తమ బినామీల పేర్లతో 15 టెండర్లు వేశారు. ఒక్కొక్కరు రెండు షాపులను పొందేలా ప్లాన్‌ వేశారు. మరోవైపు ఇతర వ్యాపారులు ఎవరూ టెండరులో పాల్గొనకుండా ఉండేందుకు టెండర్‌ షెడ్యూలు ప్రకటనను అధికారులు రహస్యంగా ఉంచారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

వారిద్దరికే దక్కిన షాపులు

ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం టెండర్లు వేసిన ఇద్దరు వ్యక్తులకే రెండేసి షాపులు దక్కడం గమనార్హం. వాస్తవానికి ఎన్టీఆర్‌ కాంప్లెక్సులో ఒక్కో దుకాణానికి గుడ్‌విల్‌ రూ.25 లక్షలు, నెలకు అద్దె రూపంలో రూ.45 వేల నుంచి రూ.75 వేల వరకు వస్తుంది. మిగిలిన దుకాణాల విషయంలో వీఎంసీ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే ఈ నాలుగు దుకాణాల వ్యవహారంలో పాటదారులతో అధికారులు కుమ్మక్కయి సుమారు రూ.80 లక్షలపైచిలుకు పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. షాపులు దక్కించుకున్న ఇద్దరు వ్యక్తులకు ఇప్పటికే ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో ఒకరికి ఆరు షాపులు, మరొకరికి నాలుగు షాపులు ఉండటం గమనార్హం.

ఏఎంసీ కాంప్లెక్స్‌లోనూ అదే దారి

ఏఎంసీ కాంప్లెక్సులోని ఐదు దుకాణాలకు ఇటీవల వేలం పాట నిర్వహించారు. వీటి విషయంలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించి వీఎంసీ ఆదాయానికి గండికొట్టారు. ఈ దుకాణాలకు రూ.12,92,544 నుంచి రూ.25,88,688 వరకు గుడ్‌విల్‌, ఈఎండీ రూ.3,23,136 నుంచి రూ.6,53,933 వరకు చెల్లించాలి. షెడ్యూలు ఖరీదు జీఎస్‌టీతో కలిపి రూ.3,540గా నిర్ణయించారు. షాపుల అద్దె రూ.35,904 నుంచి రూ.71,908 వరకు నిర్ణయించారు. అధికారులు షాపు నెంబరు 37ను రెండు భాగాలుగా విభజించారు. 37ఏ షాపునకు వేలం పాట నిర్వహించారు. అయితే ఈ షాపునకు రూ.12,90,000 గుడ్‌ విల్‌ మాత్రమే పెట్టారు. వేలంపాటలో పాయకాపురానికి చెందిన అమరయ్యకు దీన్ని కట్టబె ట్టారు. వాస్తవానికి సుమారు రూ.26 లక్షల గుడ్‌ విల్‌, రూ.71 వేల అద్దె ఈ షాపునకు రావాల్సి ఉంది. 37ఏ షాపునకు తక్కువ డిపాజిట్‌, తక్కువ అద్దెకు కట్టబెట్టడంపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చినా అధికారులు లెక్కచేయలేదు. ఇటీవల జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో తీర్మానం చేయించి పాటదారుడి కి షాపును కట్టబెట్టారు.

Updated Date - Feb 26 , 2024 | 01:22 AM