Share News

విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:57 PM

పెద్దలు, పిల్లల విరామకాల సద్వినియోగానికి, విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయని, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడంతోపాటు, ఆలోచనా దృక్పథాన్ని మెరుగుప రచడంలో గ్రంథాలయాల పాత్ర ఎనలేనిదని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక గంటసేపయినా గ్రరథాలయాలకు వచ్చి వివిధ రకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడంద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని ఆత్కూరు, మానికొండ, ఉంగుటూరు, తేలప్రోలు గ్రంథాలయాధికారులు బీవీ కృష్ణారావు, ఎల్‌,హరికృష్ణ, యు,చంద్రశేఖరరావు, బి.శ్రీనివాసరావు అన్నారు.

 విజ్ఞాన సముపార్జనకు  గ్రంథాలయాలు

ఉంగుటూరు, జూన్‌ 3 : పెద్దలు, పిల్లల విరామకాల సద్వినియోగానికి, విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయని, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడంతోపాటు, ఆలోచనా దృక్పథాన్ని మెరుగుప రచడంలో గ్రంథాలయాల పాత్ర ఎనలేనిదని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక గంటసేపయినా గ్రరథాలయాలకు వచ్చి వివిధ రకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడంద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని ఆత్కూరు, మానికొండ, ఉంగుటూరు, తేలప్రోలు గ్రంథాలయాధికారులు బీవీ కృష్ణారావు, ఎల్‌,హరికృష్ణ, యు,చంద్రశేఖరరావు, బి.శ్రీనివాసరావు అన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాల్లో భాగంగా సోమవారం మండలంలోని నాలుగు గ్రంథాలయాల్లో విద్యార్థులకు పుస్తకపఠనం, కథలు చెప్పించడం, డ్రాయింగ్‌, న్యూస్‌పేపర్‌ చదివించడం, భారతదేశంమ్యాప్‌పై అవగాహన కలిగించడం తోపాటు, క్యారమ్స్‌, చదరంగం, స్నేక్‌ అండ్‌ లీడర్‌ వంటి ఆటలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రంథాలయసిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

గన్నవరం : మండలంలోని గన్నవరం గ్రేడ్‌-1, ముస్తాబాద గ్రేడ్‌-3 గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. సోమవారం విద్యార్థులకు నీతి కథలు చదివించటం, మ్యూజికల్‌ ఛైర్స్‌, క్యారమ్స్‌ ఆటలు ఆడించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాల యాలకు రావటం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. విద్యా ర్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మంచి భవిష్యత్‌ ఉంటుంద న్నారు. గ్రంథాలయాల ఇన్‌చార్జులు బాబూరావు, కె.జ్యోతికుమారి పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:57 PM