Share News

విజ్ఞానం పెంచుకోవడం అభినందనీయం

ABN , Publish Date - May 29 , 2024 | 01:08 AM

విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవటం అభినందనీయమని రామారావు అన్నారు. మండ లంలోని ముస్తాబాద గ్రేడ్‌-3 గ్రంథాలయంలో మంగళవారం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా కథల పుస్తకాలు చదివించటంతో పాటు చెస్‌ వంటి క్రీడలు ఆడించారు.

  విజ్ఞానం పెంచుకోవడం అభినందనీయం
గన్నవరం గ్రేడ్‌-1 గ్రంథాలయంలో చెస్‌ ఆడుతున్న విద్యార్థులు

గన్నవరం, మే 28 : విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవటం అభినందనీయమని రామారావు అన్నారు. మండ లంలోని ముస్తాబాద గ్రేడ్‌-3 గ్రంథాలయంలో మంగళవారం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా కథల పుస్తకాలు చదివించటంతో పాటు చెస్‌ వంటి క్రీడలు ఆడించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. శేషగిరిరావు, శ్రీనివాసు, అనిల్‌, గ్రంథాలయ అధికారి కె.జ్యోతి కుమారి పాల్గొన్నారు. గన్నవరం గ్రేడ్‌-1 గ్రంథాలయంలో క్యారమ్‌ బోర్డు, చెస్‌ వంటి పోటీలు నిర్వహించారు. రిటైర్డ్‌ హిందీ పండిట్‌ కంభంపాటి ధర్మారావు, గ్రంథాలయ ఇన్‌ఛార్జి డి.బాబూరావు పాల్గొన్నారు.

ఉయ్యూరు : స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసి శిక్షణ శిబిరంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు యోగ, క్లాసికల్‌ డ్యాన్స్‌పై శిక్షణ నిచ్చారు. యాగాసనాల వల్ల ఆరోగ్యం, డ్యాన్స్‌తో వ్యాయామం కలుగుతుందని గ్రంథాలయాధికారి రమణి అన్నారు. ఈ సందర్భంగా టి. లాస్యశ్రీ చేసిన క్లాసికల్‌ డ్యాన్స్‌, యోగ చిన్నారులను ఆక ట్టుకుంది. గ్రంఽథాలయా వల్ల ఉపయోగాలు, విజ్ఞా నంపై గ్రంథాలయ అధికారి అవగాహన కల్పించా రు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 01:08 AM