వైభవంగా ఆషాఢ పౌర్ణమి
ABN , Publish Date - Jul 22 , 2024 | 12:42 AM
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మండలంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎక్కడికక్కడ భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకొన్నారు. టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు వెలగపూడి శంకరబాబు, శ్రీదేవి దంపతులు కామయ్యతోపు గంగానమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మేళతాళాలు, బేతాళనృత్యాల నడుమ ఉత్సాహంగా బోనాల ఊరేగింపు సాగిం ది.
పెనమలూరు, జూలై 21 : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మండలంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎక్కడికక్కడ భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకొన్నారు. టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు వెలగపూడి శంకరబాబు, శ్రీదేవి దంపతులు కామయ్యతోపు గంగానమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మేళతాళాలు, బేతాళనృత్యాల నడుమ ఉత్సాహంగా బోనాల ఊరేగింపు సాగిం ది. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ గావించారు. ఫ పోరంకి శ్రీనివాసనగర్ కాలనీలో ని షిరిడీ సాయినాథునికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, హేమ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిరిడీ సాయినాథుని అనుగ్రహ కటాక్షాలు ప్రజలకు తోడుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. విశేష పూజల అనం తరం భక్తులకు అన్నసమారాధన చేశారు.
రాజ్యలక్ష్మి అమ్మవారికి ఆషాఢ సారె
ఉయ్యూరు : శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రాం గణంలో రాజ్యలక్మి అమ్మవారికి శ్రీలలితా మహిళా సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢ సారె సమ ర్పించారు. ఈ సందర్భంగా లలితా సహస్ర నామ పారాయణం చేసి విశేష పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి రొంపిచర్ల మురళి ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు చోడవరపు బాపిరాజు తదితరులు పాల్గొని సేవలందించారు.
ఫ గురుపౌర్ణమి పురస్కరించుకుని బాబా మందిరాల వద్ద ఆదివారం పూజలు, అన్న సమారాధన నిర్వహిం చారు. ఈ సందర్భంగా బాబాకు అభిషేకాలు, పూల అలంకారాలు చేశారు. రాజర్షినగర్, రామాలయం సెంటర్, కేసీపీ కర్మాగారం సమీపాన, గండిగుంట అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి పూజలు, భజనల్లో పాల్గొన్నారు.
ఫ సాయిబాబా మందిరాల వద్ద ఆదివారం అన్న సమారాధన చేశారు. రాజర్షినగర్ జ్ఞాన సాయుబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన అన్న సమారాధనను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఉయ్యూరు చైర్మన్ వి.సత్యనారాయణ, మందిర ట్రస్టీ పూర్ణచంద్ర రావు ప్రారంభించారు. కేసీపీ కర్మాగారం సమీపాన, శివాయం సమీపాన, గండిగుంట అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన చే శారు.
శాకంబరీగా తిరుపతమ్మ
గన్నవరం : పాతగన్నవరంలోని లక్ష్మీతిరుపతమ్మ ఆల యంలో ఆదివారం శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢమాసం గురుపౌర్ణమి సందర్భం గా ఆలయ కమిటీ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపారు. లక్ష్మీతిరుపతమ్మ సమేత గోప య్యస్వామి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించారు. శాకంబరిదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. తొలుత ఆలయ ప్రాంగణం నుంచి మాను (మహా లక్ష్మీ)కి పూజలు చేసి గ్రామ పొంగళ్లను నివేదించారు. అంకమ్మ తల్లికి ఆషాఢ బోనాలను సమర్పించారు. సువాసినీలచే శ్రీలలిత సహస్రనామ పారాయణం, శ్రీలక్ష్మీ అష్టోత్తరం జరిపారు. జాస్తి శ్రీధర్ పాల్గొన్నారు.
ఫకేసరపల్లి దుర్గాపురంలో కనకదుర్గమ్మ ఆలయం లో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మేళతాళాలు, కోలా టాలతో అమ్మవారికి పూజలు చేశారు. లలితా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. బ్రాహ్మణ పరిషత్ మండల అధ్యక్షులు పన్యారం విష్ణుమూర్తి, కప్పగంతు లక్ష్మణశాస్ర్తి, గోపరాజు సత్యపవన్‌కుమార్, మామిళ్లపల్లి నాగసుబ్బారావు, తిమ్మరాజు వెంకట సుబ్బారావు, యామర్తి వకుళ, సరస్వతుల ఆదిత్య, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
శాకంబరీగా కనకదుర్గమ్మ
హనుమాన్‌జంక్షన్ : ఆషాఢమాసం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో కనకదుర్గమ్మ ఆల యాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిం చారు. వీరవల్లి కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని కూరగాయలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ అర్చకులు మురళీ ఆధ్వ ర్యంలో ఆలయ నిరాహ్వకుడు వంగపండు సూర్యప్రకా శరావు దంపతులు అమ్మవారికి సారెను సమర్పిం చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చందు రమాదేవి శ్రీనివాసరావు దంపతులు, కొండపల్లి వెంకన్న పాల్గొ న్నారు. కె.సీతారాంపురంలో గంగానమ్మకు గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడు ఎనికేపల్లి శ్రీమన్నారాయణ, మజ్జి శ్రీనివాసరావు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.
ఫ జంక్షన్‌లోని బాబా మందిరంలో ఆదివారం గురుపౌర్ణమి పురస్కరించుకొని బాబాకు విశేషంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు బాబాను దర్శనం చేసుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మందిరానికి స్థానిక వ్యాపార వేత్త ముప్పా శ్రీనివాసరావు, సత్యవతి దంప తుల కుమార్తె ఎన్నారై భావన రూ.2లక్షలు విలువ చేసే 2కిలోల వెండి పూజా సామగ్రిని అందజేశారు.
ఫ వీరవల్లి బాబా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వేడుకగా నిర్వహించారు. తొమ్మిది రకాల పండ్ల రసాలతో అభిషేకం, అమ్మవారికి శాకంబరి అలంకరణ చేసి, కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. తేలప్రోలు భజన సమాజం బృందం సభ్యులు నిర్వహించిన షిరిడీసాయి గానామృతం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచింది. 1800 మం దికి అన్నసమారాధన చేశారు. ఆలయ కమిటీ సభ్యు లు కోడెబోయిన బాబి, రావి ఈశ్వర్, తవ్వా ఆదిలక్ష్మి, గుత్తా నాగమణి, లంక బేబీ సరోజని, తుమ్మల భావన తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్
కంకిపాడు : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆయన సతీమణి హేమతో కలిసి ఆదివారం గురుపౌర్ణమిని పురస్కరించుకొని మొక్కలు తీర్చుకున్నారు. తొలుత పెనమలూరు మండలంలోని గోసాల శివారు వైకుంఠపురంలోని కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో అమ్మ వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆషాఢ మాస సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సెంగెపు రంగారావు, ఆలయ కమిటి ప్రతినిధులు పాల్గొన్నా రు. గొడవర్రు అంకమ్మ తల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అమ్మవారికి ఆషా ఢ సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మాదు నాగరాజు తదిత రులు పాల్గొన్నారు. చలివేంద్రపాలెం, ఉప్పలూరు, ప్రొద్దు టూ రు, కంకిపాడులోని సాయి నాథుని ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రొద్దుటూరు శివారు గాయత్రి విహార్‌లోని బాబా ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహస్రమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే విధంగా చలివేంద్రపాలెంలోని సాయిబాబు ఆలయంలో నిర్వహించిన అన్నసమారా ధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.