Share News

వైసీపీ అధిష్టానం తీరు నచ్చకే బయటకు వచ్చేశా

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:15 AM

‘నేను ఎంపీగా ఉన్న సమయంలో ఇటీవల పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబును బాగా తిట్టాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. నాకు తిట్టడం రాదు.. అధిష్టానం తీరు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చా.. ఎప్పుడూ రాజకీయ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్న పేర్నినానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు వచ్చాయి..’ అని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి అన్నారు.

వైసీపీ అధిష్టానం తీరు నచ్చకే బయటకు వచ్చేశా
పెడన, మచిలీపట్నంలలో ప్రజాగళం కార్యక్రమం

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 17 : ‘నేను ఎంపీగా ఉన్న సమయంలో ఇటీవల పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబును బాగా తిట్టాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. నాకు తిట్టడం రాదు.. అధిష్టానం తీరు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చా.. ఎప్పుడూ రాజకీయ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్న పేర్నినానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు వచ్చాయి..’ అని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి అన్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి కోనేరుసెంటర్‌లో బహిరంగ సభలో బాలశౌరి మాట్లాడారు. పోర్టుకు నిధులు తానే తీసుకువచ్చానని పేర్ని నాని చెబుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. మచిలీపట్నంలోని సాల్ట్‌ ఫ్యాక్టరీకి చెందిన మూడు వేల ఎకరాలకు ఇండస్ర్టీయల్‌ హబ్‌గా రూపొందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లను బాలశౌరి కోరారు. మచిలీపట్నం-రేపల్లె రైలుమార్గం నిర్మిస్తామని, ముస్లింల కోరికమేరకు షాదీఖానా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

నీతుల నానికి తగిన బుద్ది చెబుతాం : చంద్రబాబు

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అక్రమంగా హత్య కేసులో ఎమ్మెల్యే పేర్ని నాని ఇరికించాడని, అధికారంలోకి రాగానే వారిని వదిలే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. నీతుల నాని ఇష్టారాజ్యంగా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలను వేధించాడన్నారు. రంగనాయక స్వామి దేవాలయం ఆస్తులను, దేవుడిని మింగేందుకు వైసీపీ నాయకులు చూస్తున్నారన్నారు. గంజాయి ప్రభుత్వం కావాలో అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలో బందరు ప్రజలు తెలుసుకోవాలన్నారు. సీఎం జగన్‌రెడ్డి ఎలా సైకోలా వ్యవహరిస్తున్నారో ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు.

ఎదురు మాట్లాడితే జైలుకే.. : బాలశౌరి

జగన్‌ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమైందని, వ్యతిరేకంగా మాట్లాడితే జైలులో వేయటమే ఆయనకు తెలుసని ఎన్డీఏ కూటమి మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. బుధవారం పెడన బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన ప్రజాగళం యాత్రలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నా ప్రజలకు సేవ చేయలేకపోయానన్నారు. తీరప్రాంత మంచినీటి సమస్యకు జలజీవన్‌ మిషన్‌ నుంచి రూ.330 కోట్ల నిధులు తెస్తే రాష్ట్ర ప్రభుత్వ వాట ఇవ్వకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కుళాయి వేసి, స్వచ్ఛమైన నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. చేనేత, కలంకారీ, ఆక్వా, వ్యవసాయ రైతుల్ని ఆదుకుంటామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపే నైజం జగన్‌దేనని అన్నారు. సొంత నిధులతో కౌలు రైతులను ఆదుకున్న గొప్ప వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని, అతని ఆశాయాలు నచ్చి, జనసేనలోకి వచ్చానని తెలిపారు.

ఆరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు : కాగిత

రాష్ట్రంలో ఐదేళ్ల పాటు జగన్‌ అరాచకపాలనతో ప్రజలు విసిగిపోయారని ఎన్డీఏ కూటమి పెడన అసెంబ్లీ అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. పెడనలో చేనేత రంగాన్ని ప్రొత్సహించింది చంద్రబాబు నాయుడు మాత్రమేనని, చేనేతల ఆకలి చావులకు జగన్‌ కారణమయ్యారన్నారు. నాలుగు మండలాల్లో ఇసుక దోపిడీ చేసి, చెరువుల తవ్వకాల్లో రైతులను దోచుకొని నాయకులు జేబులు నింపుకున్నారన్నారు. తనను నమ్మి చంద్రబాబు సీటు కేటాయించారని, పవన్‌, బీజేపీ ఆశీస్సులతో ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాగిత కోరారు.

Updated Date - Apr 18 , 2024 | 01:15 AM