Share News

వైభవంగా వసంతోత్సవం

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:05 AM

వీరమ్మతల్లి వసంతోత్సవ వేడుక మంగళవారం వైభవంగా నిర్వహించారు. పదిహేను రోజు ల తిరునాళ్ల అనంతరం తెల్లవారుఝామున ప్రధాన రహ దారిపై ఉన్న ఆలయం నుంచి బయలు దేరిన అమ్మవారు డప్పువా యిద్యాల నడుమ భక్తులు తోడురాగా ఊరేగుతూ ఉదయం రావిచెట్టు సెంటర్‌ సమీపాన ఉన్న మెట్టినింటికి చేరుకోగా పారుపూడి వంశస్తుల ఆడపడుచులతో పాటు పలువురు మహిళలు నీటిబిందెలతో స్వాగతం పలికి ఆనం దో త్సాహాలతో వసంతోత్సవం నిర్వహించారు.

వైభవంగా వసంతోత్సవం
వీరమ్మతల్లి వసంతోత్సవం

ఉయ్యూరు, మార్చి 5 : వీరమ్మతల్లి వసంతోత్సవ వేడుక మంగళవారం వైభవంగా నిర్వహించారు. పదిహేను రోజు ల తిరునాళ్ల అనంతరం తెల్లవారుఝామున ప్రధాన రహ దారిపై ఉన్న ఆలయం నుంచి బయలు దేరిన అమ్మవారు డప్పువా యిద్యాల నడుమ భక్తులు తోడురాగా ఊరేగుతూ ఉదయం రావిచెట్టు సెంటర్‌ సమీపాన ఉన్న మెట్టినింటికి చేరుకోగా పారుపూడి వంశస్తుల ఆడపడుచులతో పాటు పలువురు మహిళలు నీటిబిందెలతో స్వాగతం పలికి ఆనం దో త్సాహాలతో వసంతోత్సవం నిర్వహించారు. మెట్టినింటికి చేరు కున్న అమ్మవారు శివరాత్రి రోజున తోట్లవల్లూరు మం డల పరిధి కృష్ణానదీ పాయలో పవిత్ర స్నానమాచరించి తిరిగి మేళతాళాలతో మెట్టినింటికి చేరుకుంటారు.

అలరించిన నృత్యాలు

వీరమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా ఎంకె డ్యాన్స్‌ అకాడమి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చిన్నారులు నిర్వహించిన నృత్యాలు అందరిని అలరించాయి. తిరునాళ్ల చివరి రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఎంకె డ్యాన్స్‌ అకాడమి విద్యార్థులు ప్రదర్శించిన వీరమ్మతల్లి చరిత్ర, జానపద నృత్యాలు భక్తులను కేరింతలు కొట్టించాయి. విద్యతోపాటు సంస్కృతి, సాంప్రదాయాలు అలవరుచు కునేలా పలు కార్యక్రమాలు చేస్తున్నట్టు అకాడమీ డైరెక్టర్‌ ఎంకె బాబు వివరించారు.

Updated Date - Mar 06 , 2024 | 01:05 AM