Share News

నిరుపయోగంగా నీటి ట్యాంకులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:50 AM

ఉయ్యూరు నగరపంచాయతీ పరిధి నాగన్నగూడెం సమీపాన జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు నీరులేక గృహనిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారు.

నిరుపయోగంగా నీటి ట్యాంకులు
నాగన్నగూడెం జగనన్న కాలనీలో నీరు నింపకపోవడంతో నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్‌ ట్యాంకులు

నీరు నింపకపోవడంతో గృహనిర్మాణదారులకు ఇక్కట్లు

ఉయ్యూరు, జనవరి 11: ఉయ్యూరు నగరపంచాయతీ పరిధి నాగన్నగూడెం సమీపాన జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు నీరులేక గృహనిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారు. నగరపంచాయతీ పరిధిలో ఇళ్లులేని పేదలకు పట్టణానికి దూరంగా నాగన్నగూడెం సమీపాన మాగాణి భూమిని సేకరించి 2వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ఇళ్ల నిర్మాణానికి నగరపంచాయతీ అరకొర వసతులు కల్పించి, ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇళ్ల నిర్మించుకునేందుకు నీటి బోరు వేసి నీరు నిల్వ ఉంచేందుకు రోడ్లపక్కన ప్లాస్టిక్‌ నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. కొన్నిరోజులుగా సిబ్బంది ట్యాంకులను నీటితో నింపడం లేదు. దీంతో నిర్మా ణానికి, గోడలు, పిల్లర్లు తడుపుకొనేందుకు నీరులేక నిర్మాణదారులు ఇబ్బంది పడు తున్నారు. నీరు లేక నిర్మాణం మధ్యలో నిలిపివేయలేక కొందరు అప్పులుచేసి చేతి పంపులు వేసుకుని నానా తంటాలు పడతున్నారు. అలంకారపాయ్రంగా ఉన్న ట్యాం కుల్లో నీరు లేక ఇంటి నిర్మాణం చేసేదెలా అని ఆందోళన చెందుతున్నారు. అంతర్గత రోడ్లు లేక నిర్మాణ సామగ్రి చేరవేసుకునేందుకు వాహనాలు రాక నిర్మాణదారులు అవస్థలు పడుతున్నారు.

ట్యాంకుల్లో నీటిని నింపుతాం

నాగన్నగూడెం జగనన్న కాలనీలోని ట్యాంకుల్లో నీరు నింపుతాం. ఇళ్లు కట్టుకునే వారికి ఇబ్బంది లేకుండా చూస్తాం.

- పి.వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్‌

Updated Date - Jan 12 , 2024 | 12:50 AM