Share News

రేపు యూపీఎస్సీ పరీక్షలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:43 AM

ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా ఈనెల 21వ తేదీన 1,872 మంది అభ్యర్థులు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పరీక్షలు రాయనున్నారని, ఐదు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, లోటుపాట్లు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు ఆదే శించారు.

రేపు యూపీఎస్సీ పరీక్షలు

ఎన్టీఆర్‌ జిల్లాలో రాయనున్న 1,872 మంది

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయండి

అధికారులకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు ఆదేశం

కృష్ణలంక, ఏప్రిల్‌ 19: ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా ఈనెల 21వ తేదీన 1,872 మంది అభ్యర్థులు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పరీక్షలు రాయనున్నారని, ఐదు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, లోటుపాట్లు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు ఆదే శించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో వెన్యూ సూపర్‌వైజర్లు, లైజన్‌ కం ఇన్‌స్పెక్టింగ్‌ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీఏ), నావెల్‌ అకాడమీ(ఎన్‌ఏ) పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలు ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం ఐదుగురు రూటు అధి కారులు, ఐదుగురు లైజన్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. పరీక్షా పత్రా లను స్ర్టాంగ్‌రూంలో భద్రపరిచామని, సకాలంలో అవి కేంద్రాలకు చేరుకునేలా రూటు అధికారులు చూడాలని ఆదేశించారు. పోలీస్‌, తపాలా, వైద్య ఆరోగ్యం, ఏపీ ఈపీడీసీఎల్‌, జీవీఎంసీ శాఖలు వారికి అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో అంత రాయం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, లైజన్‌ అధికారులు, పోలీసు, తపాలా, వైద్యఆరోగ్యం, ఏపీఈపీడీసీఎల్‌, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:43 AM