రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:10 AM
విజయవాడ, కృష్ణా కెనాల్ మధ్య ఆదివారం ఓ గుర్తు తెలియని 45 ఏళ్ళ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

వన్‌టౌన్, జూలై 7: విజయవాడ, కృష్ణా కెనాల్ మధ్య ఆదివారం ఓ గుర్తు తెలియని 45 ఏళ్ళ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి దేహంపై తెల్లటి పొడుగుచేతుల చొక్కా, నల్ల ప్యాంటు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.