Share News

ఇసుక రీచ్‌లలో అనధికార వసూళ్లు

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:27 AM

నందిగామ డివిజన్‌లోని ఇసుక రీచ్‌లలో అనధికారికంగా బలవంతపు వసూళ్లకు తెరలేచింది. ఒక్కో వాహనం నుంచి రూ. ఐదు వందలు నుంచి రూ. 15 వందల వరకు వసూలు చేస్తున్నారు.

ఇసుక రీచ్‌లలో అనధికార వసూళ్లు

కాంట్రాక్టర్ల తీరుపై వాహనాల యజమానుల ఆగ్రహం

చెవిటికల్లు రీచ్‌లో రెండు గంటల సేపు ధర్నా

కంచికచర్ల: నందిగామ డివిజన్‌లోని ఇసుక రీచ్‌లలో అనధికారికంగా బలవంతపు వసూళ్లకు తెరలేచింది. ఒక్కో వాహనం నుంచి రూ. ఐదు వందలు నుంచి రూ. 15 వందల వరకు వసూలు చేస్తున్నారు. వసూలు చేస్తున్న సొమ్ముకు సిబ్బంది ఎలాంటి రశీదు ఇవ్వటం లేదు. ఈ సొమ్ము చెల్లించని వాహ నాలకు రీచ్‌లలో ఇసుక లోడ్‌ చేయటం లేదు. రీచ్‌లలో రోడ్డు నిర్వహణ పేరుతో కాంట్రాక్టర్లు బలవంతంగా సొమ్ము వసూలు చేస్తుండటంపై వాహనాల యజ మానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిగామ మైనింగ్‌ డివిజన్‌ పరిధిలోని కృష్ణానదిపై కంచికచర్ల మండలం చెవిటికల్లు, మున్నలూరు, చందర్లపాడు మం డలం కాసరబాద, మునేటిపై నందిగామ మండలం కంచెల, వత్సవాయి మం డలం కన్నెవీడు రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రీచ్‌లలో టన్నుకు రూ.475 తీసుకోవాలి. ఇతరత్రా ఎలాంటి రుసుం వసూలు చేయకూడదు. కానీ మూడు రోజుల నుంచి రీచ్‌లలో వాహనాల నుంచి బలవంతంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. ట్రాక్టరుకు రూ.ఐదు వందలు, మినీ లారీకి రూ.వెయ్యి, లారీ, టిప్పరుకు రూ.15 వందలు వసూలు చేస్తున్నారు. ఇసుక ధర, లోడ్‌(టన్నేజీ) వివరాలు వేబిల్లులో పేర్కొంటున్నారు. అయితే బలవంతంగా వసూలు చేస్తున్న సొమ్ముకు రశీదు ఇవ్వడం లేదు. అదనంగా సొమ్ము ఎందుకు వసూలు చేస్తున్నారని వాహనాల యజమానులు అడిగితే రీచ్‌ లలో రోడ్డు నిర్వహణ కోసమని రీచ్‌ల వద్ద ఉంటున్న కాంట్రాక్టర్ల సిబ్బంది చెబుతున్నారు. అదనపు సొమ్ము చెల్లించిన వాహనాలకే ఇసుక లోడ్‌ చేస్తున్నారు. చేయకపోతే లోడ్‌ చేయటం లేదు. రీచ్‌లలో బాట(రోడ్డు) నిర్వహణ (మెయింటెనెన్స్‌) పేరుతో బలవంతంగా వసూలు చేయడంపై శనివారం చెవిటికల్లు రీచ్‌ వద్ద పలువురు వాహనాల యజమానులు ఆందోళనకు దిగారు. బలవంతపు వసూళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాదాపుగా రెండు గంటలు ధర్నా చేశారు. రీచ్‌లలో అనధికారికంగా సొమ్ము వసూలు చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు బాట పేరతో దోపిడీకి పాల్పడుతు న్నారని ఆరోపించారు. ఇసుక ధర పెంచితే కొనుగోలుదారులు గగ్గోలు పెడుతు న్నారని, కిరాయి కూడా గిట్టుబాటు కావడం లేదని వాహనదారులు వాపోయారు. అక్రమాలకు, దోపిడీకి తావులేకుండా ఇసుక రీచ్‌లలో అంతా పారదర్శకమని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ప్రస్తుతం రీచ్‌లలో బహిరంగంగా జరుగుతున్న దోపిడీని అరికట్టాలని వాహనాల యజమానులు, కొనుగోలుదారులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 21 , 2024 | 10:02 AM